ఆమె చూస్తే తెల్లని పాలరాతిలా బొమ్మ గుర్తొస్తుంది. ముద్దు పెట్టేయాలనేంత ముద్దుగా ఉంటుంది. ఈమెని ఎవరు పెళ్లి చేసుకుంటారో గానీ అతడంతా అదృష్టవంతుడు మరొకడు ఉండడని అభిమానులు సరదాగా అంటూ ఉంటారు. ఇక ఈమెకు ఇప్పటికే పెళ్లి అయిపోవాల్సి కానీ.. కారణాలు ఏంటో తెలియదు గానీ అది ఆగిపోయింది. ప్రస్తుతం కెరీర్ పరంగా రెండు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మరోవైపు సోషల్ మీడియాలో ఆమె క్రేజ్ బాగానే ఉంది. ఇదంతా పక్కనబెడితే ఇప్పుడు ఆమెకు సంబంధించిన చిన్నప్పటి ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఆమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో సైకిల్ పై కనిపిస్తున్న చిన్నారి మెహ్రీన్. పంజాబ్ లో పుట్టిపెరిగిన ఈ భామ.. పదేళ్ల వయసులోనే ర్యాంప్ వాక్ చేసి బ్యూటీ పీజెంట్ టైటిల్ గెలుచుకుంది. 2013లో మిస్ సౌత్ ఆసియా కెనడా పర్సనాలిటీగా నిలిచింది. ఇక ఆ తర్వాత ప్రముఖ బ్రాండ్లలో కనిపించింది. కమర్షియల్ యాడ్స్ లోనూ నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా మోడలింగ్ కెరీర్ లో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈమెకు.. టాలీవుడ్ లో ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ హిట్ కావడంతో పాటు మెహ్రీన్ నటనని చాలామంది మెచ్చుకున్నారు.
హీరోయిన్ గా తెలుగులో తొలి మూవీ చేయగానే హిందీలో కూడా ఛాన్స్ వచ్చింది. అక్కడ చేసినా సరే తెలుగులోనూ మహానుభావుడు, రాజా ది గ్రేట్, కేరాఫ్ సూర్య, ఎఫ్ 2, ఎంత మంచివాడవురా, మంచిరోజులొచ్చాయి, ఎఫ్ 3 లాంటి సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం స్పార్క్ అనే తెలుగు-తమిళ సినిమాతో పాటు ‘నీ సిగూవరేగు’ అనే కన్నడ సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది. గతేడాది భవ్య బిష్ణోయ్ అనే వ్యక్తితో మెహ్రీన్ కు ఎంగేజ్ మెంట్ జరిగింది. కానీ కొన్నాళ్ల తర్వాత దాన్ని ఈ జంట.. క్యాన్సిల్ చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే మెహ్రీన్.. ఎప్పటికప్పుడు హాట్ హట్ ఫొటోలు పోస్టు చేస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చిన్నప్పటి ఫొటో వైరల్ గా మారింది.