సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ట్రెండ్ నడుస్తుందో చెప్పలేం. ఒక్కొక్క టైములో ఒక్కో టాపిక్ నెటిజన్స్ ని ఎంటర్ టైన్ చేస్తూ ఉంటుంది. అలానే ఈ మధ్య సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్ననాటి ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిని గుర్తుపట్టేందుకు అభిమానులు కూడా తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. త్రో బ్యాక్ ట్రెండ్ తగ్గట్లే ఎక్కువగా హీరోయిన్స్ చైల్డ్ హుడ్ ఫొటోలు తెగ సర్క్యూలేట్ అవుతున్నాయి. మరి అలాంటి ఓ ఫొటోనే ఇది. ఇందులో ఉన్న ఆ చిన్నారి ఎవరో తెలుసా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. ముద్దుముద్దుగా క్యూట్ నెస్ ఇచ్చిపడేస్తున్న ఈమె హీరోయిన్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే కుర్రాళ్లలో చాలామందికి ఈమె క్రష్ గా మారిపోయింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఫాలోయింగ్ మాత్రం బాగానే మెంటైన్ చేస్తోంది. మరి ఆలస్యం చేయను గానీ చెప్పేస్తున్న.. ఈ ఫొటోలో చిన్నారి హీరోయిన్ మేఘా ఆకాశ్. తమిళంలో నటిగా కెరీర్ ప్రారంభించిన మేఘ.. నితిన్ హీరోగా చేసిన ‘లై’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది.
ఇక ఈ సినిమా తర్వాత చల్ మోహనరంగా, రాజ రాజ చోర, డియర్ మేఘ సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. అతి తక్కువ టైములోనే ప్రేక్షకులకు దగ్గరైంది. అందం, అభినయనం కలిసినట్లు ఉండే ఈ ముద్దుగుమ్మకు తెలుగులో ఏమంత అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతానికైతే సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’, అదిత్ ‘ప్రేమదేశం’, రవితేజ ‘రావణసుర’ చిత్రాల్లో హీరోయిన్ గా చేస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలన్నీ కూడా నెలల గ్యాప్ లో థియేటర్లలోకి వచ్చే అవకాశాలున్నాయి. మరి మేఘా ఆకాశ్ చిన్నప్పటి ఫొటోని మీలో ఎంతమంది గుర్తుపట్టారు. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: 20 ఏళ్లు తర్వాత కూడా థియేటర్లలో ‘చెన్నకేశవరెడ్డి’ మేనియా.. వీడియో వైరల్!