నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ఊరమాస్ సినిమాలలో చెన్నకేశవరెడ్డి ఒకటి. దర్శకుడు వివి వినాయక్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే.. చెన్నకేశవరెడ్డి బాక్సాఫీస్ కలెక్షన్స్ పక్కన పెడితే.. ఆ సినిమా ప్రేక్షకులలో, ఫ్యాన్స్ లో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇప్పటికీ అలాగే ఉంది. 2002లో సెప్టెంబర్ 25న చెన్నకేశవ రెడ్డి థియేట్రికల్ రిలీజై అప్పట్లోనే మాస్ జాతర జరిపింది.
ఇప్పుడు ఇరవై ఏళ్ళ తర్వాత మరోసారి థియేటర్స్ లో చెన్నకేశవ రెడ్డి మాస్ జాతర చేస్తున్నారు ఫ్యాన్స్. బాలయ్య ఫ్యాన్స్ అంతా చెన్నకేశవ రెడ్డి సినిమాను రీరిలీజ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఓవర్సీస్ తో పాటు తెలుగు రాష్ట్రాలలో కూడా చాలా థియేటర్స్ లో చెన్నకేశవ రెడ్డి స్పెషల్ షో పడ్డాయి. దీంతో 20 ఏళ్ళ తర్వాత కూడా థియేటర్స్ లో మాస్ మేనియా భీభత్సంగా కనిపించడం మనం చూడవచ్చు. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమాకు పరుచూరి బ్రదర్స్ ఊరమాస్ డైలాగ్స్ అందించారు.
ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో బాలయ్యను ఎన్నడూ చూడని మాస్ యాంగిల్ లో చూపించాడు వినాయక్. అలాగే అద్భుతమైన విజువల్స్ కి.. ఆల్ టైమ్ సూపర్ హిట్ సాంగ్స్ అందించాడు మణిశర్మ. అంతేగాక చెన్నకేశవ రెడ్డి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. ఆ బిజీఎం కి ఇప్పటికీ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారంటే.. థియేటర్స్ లో ఎలా మోత మోగించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక బాలయ్య సరసన టబు, శ్రియ హీరోయిన్స్ గా నటించారు. ప్రస్తుతం థియేటర్స్ లో చెన్నకేశవ రెడ్డి సినిమాను ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు మనం చూడవచ్చు. మరి చెన్నకేశవరెడ్డి మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
20 years back my first movie in theatres, now again watched it in silver screen at Gopi theatre Ongole 🔥🔥🔥🔥🔥#NandamuriBalakrishna#Chennakeshavareddy #20YearsOfCKREuphoria pic.twitter.com/cNUu7K17OF
— raghu varma dodla (@RaghuDodla) September 24, 2022
The celebration of Ceded King in his 2nd Kingdom GUNTUR🔥🔥🔥
రారెవ్వరూ నీకు సాటి…లేరెవ్వరూ నీకు పోటి 🦁 #Chennakesvareddy celebrations at Plateno cinemas, Guntur.#20YearsOfCKREuphoria pic.twitter.com/Q7gbyCQpFa
— Balayya Trends (@NBKTrends) September 24, 2022
#NandamuriBalakrishna #chennakeshavareddy Balaya babu entry. Thank you Vinayak Garu for editing the cinema with latest technology pic.twitter.com/2vaX0V9H5Y
— Konda Sai Kumar (@kondasaikumaar) September 24, 2022
#Bangalore shows 👊#ChennaKesavaReddy #20YearsOfCKREuphoria pic.twitter.com/UZZAT6LHIf
— Balayya BAKTHUDU (@AKHILRAM9769) September 24, 2022