నార్మల్ గా 'ఉంచుకోవడం' అని ఎవరైనా అంటే ఒక్కసారిగా షాకవుతారు. అలాంటిది తెలుగు హీరోయిన్ అతడ్ని ఉంచుకుంటానని ఇన్ స్టాలో ఏకంగా పోస్ట్ పెట్టింది. ఇప్పుడది కాస్త వైరల్ గా మారిపోయింది.
నటీనటులు ఎవరైనా సరే ఆచితూచి మాట్లాడుతూ ఉంటారు. కొన్నిసార్లు మాత్రం పొరపాటున నోరు జారుతూ ఉంటారు. అదికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. అలా ఇప్పుడు హీరోయిన్ మాళవిక కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. ఎందుకంటే ఓ వ్యక్తిని డైరెక్ట్ గా ఉంచుకుంటానంటూ అనడం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏం జరిగింది? అసలు ఇలా అనాల్సిన అవసరం ఏమొచ్చింది? తెలియాలంటే ఫుల్ డీటైల్స్ లోకి వెళ్లాల్సిందే.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ మాళవిక నాయర్ గురింతి తెలుగు ప్రేక్షకులకు ఓ మాదిరిగా తెలుసు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’తో టాలీవుడ్ లోకి ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత యాక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ సరైన హిట్ మూవీసే పడట్లేదు. ఈమె హీరోయిన్ గా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ త్వరలో అంటే మే 18న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ మాళవిక ఒకటి వైరల్ గా మారింది. అందులో ఈమెతో పాటు డైరెక్టర్ అనుదీప్ కూడా ఉండటం విశేషం.
‘నీకో విషయం చెప్పాలనుకుంటున్నా’ అని మాళవిక చెప్పగా.. జాతిరత్నాలు హీరో స్టైల్లో దీన్ని చెప్పండి అని డైరెక్టర్ అనుదీప్ అంటాడు. దీంతో ఏమనుకోవద్దు మరి అంటూనే.. ‘నిన్ను ఉంచుకుంటా అబ్బాయి’ అని మాళవిక చెప్పింది. డైరెక్టర్ అనుదీప్ భుజంపై చేయి వేసి మరి ఇలా చెప్పడం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ప్రమోషన్ కోసం చేసిన వీడియోనే అయినప్పటికీ.. కాస్త ఫన్నీగా అనిపిస్తోంది. ఈ వీడియోకి క్యాప్షన్ గా.. ‘అలా అనుదీప్ గారిని కూడా ఉంచుకోవడం జరిగింది’ అని పెట్టడం మరింత ఫన్నీగా అనిపించింది. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరేం అనుకున్నారు? కింద కామెంట్ చేయండి.