ఈమె తెలుగమ్మాయి. పుట్టింది విజయవాడ. పెరిగింది హైదరాబాద్. తెలుగమ్మాయిలకు ఛాన్సులు చాలా తక్కువని అంటారు కదా! అలానే ఆమె కూడా హీరోయిన్ గా మారేందుకు చాలా కష్టపడింది. అనుకున్నట్లుగానే ఓ సినిమాలో కథానాయికగా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత మెగాహీరో మూవీలో ప్రత్యేక గీతం చేసి కుర్రాళ్లతో సూపర్ హిట్ అనిపించుకుంది. ఇక అలా తెలుగుతోపాటు తమిళంలోనూ హీరోయిన్ గా చేస్తూ ఫేమ్ తెచ్చుకుంటోంది. సోషల్ మీడియాలో ఈమె ఫాలోయింగ్ కూడా గట్టిగానే ఉంది!
ఇక వివరాల్లోకి వెళ్తే.. పై ఫొటోలో కనిపిస్తున్న ఆమె, హీరోయిన్ డింపుల్ హయాతి. కాకపోతే మేకప్ లేకపోవడం వల్ల నెటిజన్స్ ఎవరూ గుర్తుపట్టలేకపోతున్నారు. ఇక ఈమె కెరీర్ విషయానికొస్తే.. డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి తీసిన ‘గల్ఫ్’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత ప్రభుదేవా-తమన్నా ‘అభినేత్రి 2’లో కీలకపాత్రలో నటించి ఆకట్టుకుంది. అదే ఏడాది వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ సినిమాలో స్పెషల్ సాంగ్ తో ఫుల్ గా ఎంటర్ టైన్ చేసింది. ఇక అప్పటినుంచి డింపుల్ చాలా ఫేమస్ అయిపోయింది.
‘గద్దలకొండ గణేష్’ తర్వాత డింపుల్ ‘యురేకా’ సినిమా చేసింది. అనంతరం బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ధనుష్-సారా అలీఖాన్ హీరోహీరోయిన్లుగా చేసిన ‘అత్రాంగి రే’లో అతిథి పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ ఏడాది విశాల్ హీరోగా చేసిన ‘సామాన్యుడు’, తెలుగులో రవితేజ ‘ఖిలాడి’లో డింపుల్ హీరోయిన్ గా చేసింది. ప్రస్తుతం గోపీచంద్-శ్రీవాస్ కాంబోలో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీలోనూ ఈమెనే కథానాయికగా చేస్తోంది. ఈమె అసలు పేరు డింపుల్, కానీ న్యూమరాలజీ వల్ల హయాతి అనే పదాన్ని తన పేరుకు జోడించింది. ఇక సినిమాల పరంగా పక్కనబెడితే సోషల్ మీడియాలోనూ ఈమె పోస్ట్ చేసే ఫొటోలన్నీ కూడా.. హీట్ పెంచుతుంటాయే తప్ప అస్సలు తగ్గించవు.