ఆమె నవ్వితే చాలు మీరు ఫ్లాట్ అయిపోవడం పక్కా. ఆమెని చూసిన తర్వాత మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం అంటే సాహసమనే చెప్పాలి. ఎందుకంటే అది చాలా కష్టం కాబట్టి. అలానే ఆ బ్యూటీ నార్త్ అమ్మాయా అంటే అస్సలు కాదు.. పదహారణాల అచ్చ తెలుగమ్మాయి. బహుశా అందుకేనేమో ఆమెకు సినిమా ఛాన్సులు పెద్దగా రావడం లేదు. అయినా సరే ఈ భామ ఏ మాత్రం తగ్గట్లేదు. ఇన్ స్టాలో హాట్ హాట్ ఫొటో షూట్స్ చేస్తూ.. తనని హీరోయిన్ గా తీసుకోవాల్సిందే అనేలా చేస్తోంది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. పైన ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి అనన్య నాగళ్ల. ఈమె అసలు పేరు అనూష నాగళ్ల. కానీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన పేరు మార్చుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పుట్టింది. తన చదువుల కోసం ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్ కు షిప్ట్ అయింది. అలా హైదరాబాద్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనన్య.. ఇన్ఫోసిస్ లో జాబ్ కూడా చేసింది. మరోవైపు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండటంతో షార్ట్ ఫిల్మ్ లో కూడా నటించింది. అలా ‘షాదీ’ అనే లఘచిత్రంలో హీరోయిన్ గా చేసింది. అదే ఆ అమ్మాయికి హీరోయిన్ గా అవకాశం తెచ్చిపెట్టింది. అలా ‘మల్లేశం’ సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
ఇక ఈ సినిమా తర్వాత అంటే గతేడాది సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ప్లే బ్యాక్’ మూవీలో హీరోయిన్ గా చేసింది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’లోనూ కీలకపాత్రలో నటించి మెప్పించింది. ప్రస్తుతం సమంత ‘శాకుంతలం’తో పాటు ‘బూట్ కట్ బాలరాజు’ సినిమాలోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఇక సినిమాల సంగతి పక్కనబెడితే ఇన్ స్టాలో మాత్రం రెచ్చిపోతూనే ఉంది. హాట్ హాట్ డ్రస్సులు వేసుకుంటూ కుర్రాళ్లని రెచ్చగొడుతూనే ఉంది. అసలు రోజూ విడిచి రోజూ అన్నట్లు గ్యాప్ లేకుండా ఫొటోస్ పోస్ట్ చేస్తూనే ఉంటుంది. దీంతో చాలామంది నెటిజన్లకు అనన్య.. చాలా బాగా రిజిస్టర్ అయిపోయింది. కానీ ఆమె చిన్నప్పటి ఫొటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.