ఈ హీరోయిన్.. తెలుగుతో పాటు డబ్బింగ్ సినిమాల్లో హీరోయిన్ గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలు చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఏకంగా మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రస్తుతం దక్షిణాది భాషల్లో మూవీస్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇక కెరీర్ పరంగా పీక్స్ లో ఉన్న ఈ బ్యూటీ.. ప్రేమలో ఉన్నానని చెప్పి ఇప్పుడు అందరికీ షాకిచ్చింది. అతడు కూడా అందరికీ తెలిసిన నటుడే కావడం విశేషం. ఇంతకీ వీళ్ల ప్రేమ కహానీ ఏంటనేది ఇప్పుడు చూద్దాం.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళంలో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్య లక్ష్మి బాగానే గుర్తింపు తెచ్చుకుంది. మలయాళంతోపాటు తమిళంలోనూ మూవీస్ చేస్తూ బిజీ అయిపోయింది. గతేడాది రిలీజైన గాడ్సే, అమ్ము, మట్టికుస్తీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 2022లో ఏకంగా 9 సినిమాల్లో ఐశ్వర్య నటించడం విశేషం. ఇలా కెరీర్ పరంగా ఫుల్ పీక్స్ లో ఉంది. ప్రస్తుతం మలయాళంలో రెండు, తమిళంలో ఒక మూవీ చేస్తోంది. ఇదంతా పక్కనబెడితే.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రేమ పెళ్లి ఇష్టమా? పెద్దలు కుదిర్చిన పెళ్లి ఇష్టమా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. అసలు పెళ్లంటేనే ఇష్టం లేదని చెప్పింది. ఇది చెప్పి నెలరోజులు కూడా కాలేదు. ఇప్పుడు నటుడు అర్జున్ దాస్ తో క్లోజ్ గా తీసుకున్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇక మాస్టర్, విక్రమ్ సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ దాస్.. ప్రస్తుతం టాలీవుడ్ లో ‘బుట్టబొమ్మ’ అనే సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే నెలల రిలీజ్ కానుంది. ఇప్పుడు అర్జున్, ఐశ్వర్య ప్రేమలో ఉన్నారని తెలిసి అందరూ షాకవుతున్నారు. శుభాకాంక్షలు చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. అదే టైంలో ఇదేం సినిమా కోసమైతే కాదుగా అని సందేహపడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా చేస్తున్నారు. ఫ్యాన్స్ ఊహించని విషయాన్ని సోషల్ మీడియాలో పెడుతున్నారు. తీరా అది నిజమని నమ్మేసరికి.. లేదు లేదు అదంతా ప్రమోషన్ కోసమే అన్నట్లు క్లారిటీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్య-అర్జున్ నిజంగా లవ్ లో ఉన్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరి వీళ్లిద్దరి ఫొటో చూసిన తర్వాత మీకేమనిపించింది. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి.