దేశంలో కరోనా సెకండ్ వేవ్ తర్వాత కేసులు తగ్గాయని సంతోషిస్తున్న తరుణంలో ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భయాందోళన సృష్టిస్తుంది. గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో కరోనా కలకలం సృష్టిస్తుంది. ఇప్పటికే కమల్ హాసన్, వడివేలు, కరీనా కపూర్, అర్జున్, మంచు మనోజ్ కరోనా భారిన పడగా.. బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి సైతం కోవిడ్ సోకినట్లుగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలియజేసింది.
ఇది కూడా చదవండి : మేం జోక్యం చేసుకోలేం : హైకోర్టు
తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘ఈ మద్యనే నాకు కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయ్యింది.. ప్రస్తుతం ఇంట్లోనే వైద్యులు చెప్పిన ప్రకారం చికిత్స తీసుకొంటున్నాను. వ్యాక్సిన్ వేయించుకున్నాక కూడా కరోనా దావానంలా వ్యాపిస్తోంది. దయచేసి అందరు మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండండి.. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చారు. దాంతో విశ్వక్ సేన్ అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా” అనే సినిమాలో నటిస్తున్నాడు.
#StaySafe #MaskUp pic.twitter.com/0wDyGqoQWt
— Vishwak Sen (@VishwakSenActor) December 31, 2021