టాలీవుడ్ లో హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం కష్టం. కానీ ఇతడు..2-3 సినిమాలు చేసేసరికే ఫేమస్ అయ్యాడు. చెప్పాలంటే మూవీస్ కంటే వివాదాలే ఎక్కువ. ఎవరో గుర్తుపట్టారా?
ఒకప్పుడు హీరోహీరోయిన్లు అంటే సినిమాల్లో మాత్రమే కనిపించేవారు. అంతకు తప్పితే బయట కనిపించడం లాంటివి చాలా తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. ప్రమోషన్ కోసం కావొచ్చు, ఫ్యాన్స్ ని కలవడానికి కావొచ్చు హీరోహీరోయిన్లు బయటకొస్తున్నారు. కావాలని చేస్తున్నారో లేదంటే అలా జరుగుతుందో తెలియదు గానీ కొందరు సెలబ్రిటీలు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్నారు. ఈ హీరో కూడా సేమ్ అలాంటి వాడే. మరి ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలుగులో హీరోలని లెక్కపెడితే బోలెడంతమంది ఉంటారు. స్టార్ హీరోలు మహా అయితే ఓ 10-15 మంది ఉంటే.. మిడ్ రేంజ్, చిన్న హీరోలు ఎంత ఈజీగా లెక్కేసుకున్నా సరే ఓ 50 మందికి పైనే ఉంటారు. అందులో ఫ్యాన్స్ సదరు హీరోని గుర్తుపెట్టుకోవాలంటే ఏదో ఓ స్పెషాలిటీ. పైన ఫొటోలో కనిపిస్తున్న పిల్లాడు విశ్వక్ సేన్. షార్ట్ ఫిల్మ్స్ తో నటుడిగా కెరీర్ ప్రారంభించిన ఇతడు.. ‘వెళ్లిపోమాకే’ మూవీతో హీరో అయ్యాడు. అది బాక్సాఫీస్ దగ్గర అంతగా ఆడకపోయినప్పటికీ నటుడిగా పేరు కాస్త పేరు తెచ్చుకున్నాడు.
ఫస్ట్ సినిమా అంత పేరు తెచ్చుకోలేదు గానీ హీరోగా చేసిన రెండో మూవీ ‘ఈ నగరానికి ఏమైంది?’ హిట్ కావడంతో పాటు విశ్వక్ సేన్ కి చాలా పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత ‘ఫలక్ నుమా దాస్’, ‘హిట్’, ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ లాంటి మూవీస్ తో ప్రేక్షకుల్ని అలరించాడు. రీసెంట్ గా ‘ధమ్కీ’తో యాక్టర్ కమ్ డైరెక్టర్ గా హిట్ కొట్టాడు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బూతులు డైరెక్ట్ గా మాట్లాడేయడం, గతంలో ఓ టీవీ యాంకర్ తో వివాదం, ప్రమోషన్ కోసం అతి చేయడం లాంటి వాటితో కాంట్రవర్సీల్లో ఇరుక్కున్నాడు. సో అదన్నమాట విషయం. మరి ఈ పిల్లాడి ఫొటో చూడగానే మీలో ఎంతమంది గుర్తుపట్టారు? కింద కామెంట్ చేయండి.