హీరోయిన్ హన్సిక పెళ్లి చేసుకుని రెండు నెలలు దాటిపోయింది. అయితే ఆమె లవ్ స్టోరీ ఏంటనేది చాలామందికి తెలియదు. ఆ విషయాల్ని 'హన్సిక లవ్ షాదీ డ్రామా' పేరుతో ఉన్న వీడియోలో చెప్పుకొచ్చింది. ఇది ప్రస్తుతం హాట్ స్టార్ లో ఉంది.
ఈ మధ్య హీరోయిన్లు వరసగా పెళ్లి చేసేసుకుంటున్నారు. అలా కొన్నాళ్ల ముందు హన్సిక కూడా పెళ్లి చేసుకుంది. అయితే ఆమె మ్యారేజ్ సాదాసీదాగా కాకుండా.. చాలా గ్రాండ్ లెవల్లో ప్లాన్ చేశారు. దాన్ని వీడియోగా తీసి ఓటీటీలోనూ స్ట్రీమింగ్ చేశారు. తాజాగా అదే ‘హన్సిక లవ్ షాదీ డ్రామా’ పేరుతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజైంది. ఇక ఈ వీడియోలో భాగంగా హన్సిక, తన పెళ్లి-భర్త గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాల్ని రివీల్ చేసింది. అలానే పెళ్లి టైంలో తనపై వచ్చిన నెగిటివ్ న్యూస్ పై కూడా స్పందించింది. ప్రస్తుతం ఇది కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. హీరోయిన్ హన్సిక, డిసెంబరు 4న తన ప్రియుడు సొహైల్ తో ఏడడుగులు వేసింది. అయితే ఇది జరగడాని కంటే ముందు సొహైల్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ ఈవెంట్ లో హన్సిక కూడా పాల్గొంది అని కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో అందరూ హన్సికపై సందేహపడ్డారు. ఆల్రెడీ పెళ్లయిన వ్యక్తిని ప్రేమించడం వల్లనే ఆ పర్సన్ లైఫ్ విడాకుల వరకు వెళ్లిందని, దీనికి హన్సికనే కారణమని కూడా అన్నారు. ఇప్పుడు వీటన్నింటిపై హన్సిక క్లారిటీ ఇచ్చేసింది.
‘నా పెళ్లి గురించి అన్నీ సీక్రెట్ గా ఉంచాలనుకున్నాను. కానీ నాకు తెలియకుండానే పెళ్లి న్యూస్ బయటకు వచ్చేసింది. అది నాకైతే అస్సలు నచ్చలేదు. ఓ సెలబ్రిటీ కావడం వల్ల నాకు ఇలా జరగడంలో తప్పులేదు. సొహైల్ గురించి మొదట్లో వార్తలు వచ్చినప్పుడు ఎంతో ఒత్తిడికి ఫీలయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు. అలాంటి టైంలో అమ్మ ఇచ్చిన సూచనతో.. ఫస్ట్ టైం మా ఫొటోలని ఇన్ స్టాలో షేర్ చేశాను. అవి చూసి అందరూ నాకు విషెస్ చెప్పారు. నాకెంతో హ్యాపీగా అనిపించింది. పరిస్థితులన్నీ సర్దుకున్నాయనుకుని చెన్నైకి షూటింగ్స్ కి వెళ్లాను. ఆ సమయంలో సొహైల్ కు గతంలో పెళ్లయిందని వార్తలొచ్చాయి. ఆ పెళ్లిలో నేను ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ, సొహైల్ తన భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి నేనే కారణమని విమర్శలు చేశారు. నిజం చెప్పాలంటే నా భర్త గతం నాకు తెలుసు. అతడి డైవోర్స్ కి మాత్రం నేను రీజన్ కాదు. గతంలో నేను రిలేషన్ లో ఉన్నాను. ఆ విషయంలో చాలామందికి తెలుసు. మళ్లీ అలాంటి రిలేషన్ కంటిన్యూ చేయాలని లేదు. ఈసారి పబ్లిక్ లోకి వస్తే నా భర్తతోనే రావాలనుకున్నాను. సొహైల్ నా జీవితంలోకి వచ్చిన క్షణాలు ఎప్పటికీ స్పెషల్’ అని హన్సిక చెప్పుకొచ్చింది. మరి హన్సిక, తన భర్త గురించి చెప్పిన దానిపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.