సినిమా సెలబ్రిటీలు- క్రికెటర్లకు మధ్య బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి మధ్య స్నేహం, ప్రేమ, పెళ్లిళ్లు కూడా ఇప్పటికే చాలా చూశాం. తాజాగా టాస్కీవాలా ఫేమ్ ప్రియాంక జావల్కర్- జూనియర్ గంగూలీ వెంకటేశ్ అయ్యర్ పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే ప్రేమ, స్నేహం ఇలాంటి కోణాల్లో కాదులెండి. ప్రియాంక జావల్కర్ పెట్టిన ఫొటోకు సంబంధించి వెంకటేశ్ అయ్యర్ స్పందించాడు. ఇప్పుడు ఆ అంశం హాట్ టాపిక్ గా మారింది.
ఇదీ చదవండి: పవన్ కల్యాణ్ రేంజ్ స్టార్ ఎవరూ లేరు.. విజయేంద్ర ప్రసాద్ కామెంట్స్ వైరల్!
విషయం ఏంటంటే.. హీరోయిన్లు అన్నాక సోషల్ మీడియా ఖాతాల్లో తరచూ ఫొటోలు అప్ లోడ్ చేస్తుంటారు. అలాగే ప్రియాంక జావల్కర్ కూడా తన ఫొటో ఒకటి కర్టన్ చాటున ఉండి.. బూ అంటూ క్యాప్షన్ తో పిక్ పెట్టింది. ఆ ఫొటోకు చాలా మంది కామెంట్లు చేశారు. వారిలో వెంకటేశ్ అయ్యర్ కూడా ఒకడు. ప్రియాంక జావల్కర్ ఫొటోకి వెంకటేశ్ అయ్యర్ క్యూట్ అంటూ కామెంట్ చేశాడు. అందుకు స్పందించిన జావల్కర్.. ఎవరు నువ్వు? అని కామెంట్ చేసింది. అంతే ఆమె ఇచ్చిన రిప్లైకి నెటిజన్లు ఓ రేంజ్లో రెస్పాండ్ అవుతున్నారు. కొందరు అంతర్జాతీయ క్రికెటర్ అని చెప్పగా.. మరికొంత కేకేఆర్ టీమ్ కి ధోనీ లాంటోడు అంటూ రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి ఇన్ స్టాగ్రామ్ లో వీరి రెస్పాన్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఫన్నీ ఇన్సిడెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.