కాస్త మూడీగా ఉన్నావా? అయితే ఓ పాట విను రిలాక్స్ అవుతావు అంటూ సమధానం వస్తుంది. అంతలా సంగీతానికి శక్తి ఉంది అంటారు. అందుకే కాబోలు సంగీతానికి రాళ్లు సైతం కరుగుతాయి అంటారు పెద్దలు. ఇక ”ఆస్వాదించే మనసు ఉండాలే గానీ నిశ్శబ్దం కూడా ఓ సంగీతమే”. అంతలా పాటలు మన జీవితంలో పెనవేసుకు పోయాయి. ఇలా మనలో అల్లుకుపోయిన పాటలను ఓ స్టార్ సింగర్ తప్పుగా పాడుతూ కూనీ చేస్తున్నాడు అంటూ ఓ భాషాభిమాని ఆ సింగర్ పై విమర్శలు గుప్పిస్తున్నాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..
సిధ్ శ్రీరామ్.. ప్రస్తుతం భారత సినీ సంగీత ప్రపంచాన్ని ఏలుతున్న స్టార్ సింగర్. ఇక తెలుగులో అయితే అతడి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓ స్టార్ హీరోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అతడికి ఉంది. దివంగత సింగర్ బాల సుబ్రహ్మణ్యం తరువాత మళ్లీ అంతటి పేరును సంపాదించుకున్న పాటగాడిగా సిధ్ శ్రీరామ్ ప్రశంసలు పొందాడు. అయితే ఇంతటి పేరు పొందిన సిధ్ పాటల్ని మాత్రం తప్పుగా పాడుతున్నాడు అంటూ సాహిత్యాభిమాని అయిన పమిడికాల్వ మధు అనే వ్యక్తి చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం అతడు సిధ్ శ్రీరామ్ పాడిన విధానంపై స్పందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. పమిడికాల్వ మధు ఆ వీడియోలో ఈ విధంగా స్పందించాడు.” ఇక నుంచైనా సిధ్ శ్రీరామ్ పాడే పాటల్లో ఉంటే.. కంటే.. ఒంటి.. అనే పదాలను రాయకండి వాటిని అతడు ఉల్టే.. కల్టే.. ఒల్టి అని తప్పుగా పాడుతున్నాడు అని తెలిపాడు. అలాగే దాక్కుందాం.. పదాన్నిదాల్కుందాం అని, కొట్టుకుందాం అనే పదాన్ని కొట్టుకుల్దాం ని పాడి తెలుగు పదాలను కూనీ చేస్తున్నాడని వాపోయాడు.
ఇక ఈ పాటల్లో తప్పులు హీరోలకు పాటల రచయితలకు, సంగీత దర్శకులకు కనిపించలేదా అంటూ ప్రశ్నించాడు. ప్రస్తుతం అతడు సిధ్ శ్రీరామ్ పై చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై కొందరు నెటిజన్స్ స్పందిస్తూ.. ఇది నిజమే.. కొన్ని తప్పులను సరిదిద్దుకొవాలి అనగా. ఎట్టకేలకు దీనిపై ఒకరు స్పందించారు అని మరో నెటిజన్ అన్నాడు. మరి ఈ వీడియో పై సిధ్ ఏ విధంగా స్పందిస్తాడో వేచి చూడాలి. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
On point 🎯. Sid voice is amazing but need few corrections in his Telugu pronunciations. More than lyric writers, music directors should take care of this.
Any day would prefer to listen #hemachandra #anuragkulkarni #SreeramaChandra and #Revanth over #SidSriram in Telugu. https://t.co/7gYZgAeqmC
— Abhi (@abhi_is_online) August 24, 2022
ఈ తప్పెవరిది ? పాటల రచయితలదా లేదా సంగీత దర్శకుడిదా ? లేదంటే, తెలుగు భాషకి నూతన శబ్దాలంకారాన్ని అందిస్తున్న సిద్ద్ శ్రీరాం గారి గాత్రాన్ని వింటూ మైమరచిపోతున్న తెలుగు సినీ సంగీతాభిమానులదా ? @ThisIsDSP @boselyricist @MusicThaman @ramjowrites @jonnavithula_RR @mmkeeravaani @idhatri2 pic.twitter.com/ErgNmeLoxQ
— Ramesh Masthipuram (@rameshmasthi) August 24, 2022