యాంకర్ అనసూయ.. ప్రస్తుతం తెలుగు బుల్లితెరపైనే కాకుండా స్టార్ హీరో సినిమాల్లో సైతం నటిస్తూ మంచి క్రేజ్ ని మూటగట్టుకుంటోంది. ఇదిలా ఉంటే అనసూయకు పిల్లలంటే చాలా ఇష్టం. పైగా ఆడిపిల్లలంటే ఇక ఎంతో ఇష్టంతో ఎత్తుకుంటుంది. అయితే ప్రతీ పండగకి ఈవెంట్ ని ప్లాన్ చేసే ఈటీవీ మల్లెమాల కాంబో ఈ సారి శ్రీరామనవమికి కూడా సీతారాముల కళ్యాణం చూతం రారాండి అనే పేరుతో ఓ ప్రోగ్రామ్ ని ప్లాన్ చేశారు. ఇక ఈ కళ్యాణానికి జబర్దస్త్ కమెడియన్లతో పాటు బుల్లితెర రీల్, రియల్ లైఫ్ కపుల్స్ ని కూడా ఇన్ వైట్ చేశారు.
ఇది కూడా చదవండి: తనకి కాబోయే భార్య ఎవరో బయట పెట్టిన సుడిగాలి సుధీర్!
ఇందులో యాంకర్ అనసూయ అందరితో సరదా సరదా ముచ్చట్లు పెడుతూ అందరితో పాటు ఓ పాటకు డ్యాన్స్ కూడా చేసింది. అయితే సరదాగా సాగిన ఈవెంట్ లో అనసూయ ముద్దులొలికే ఓ పాపన ఎత్తుకుని ఆడిస్తూ ఉంది. అలా అనసూయ ఎత్తుకున్న ఆ పాప ఎవరని తెలుసుకునేందుకు నెటిజన్స్ తెగ ఆరాటపడుతున్నారు. ఆ పాప మాత్రం జబర్ధస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ లలో కనిపించే పంచ్ ప్రసాద్ కూతురని తెలుస్తోంది. కాగా కొన్ని వీడియోల్లో ఆ పాప పంచ్ ప్రసాద్ ఎత్తుకోవడం చూసిన నెటిజన్స్ అంతా ఆయనే కూతురే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.