బుల్లితెరపై సీరియల్లో, షో ల్లో ఎందరో నటిస్తుంటారు. కానీ వారిలో కొందరికి మాత్రమే గుర్తింపు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. చాలా మంది.. సీరియల్ లో నటించే వారికి ఏం క్రేజ్ ఉంటుందిలే అనుకుంటారు. కానీ సీరియల్ నటించే కొందరికి.. వెండి తెరపై మెరిసే హీరోయిన్లకు ఉన్నత క్రేజ్ ఉంటుంది. అలాంటి వారిలో వైష్ణవి ఒకరు. తెలుగు బులితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించింది ఈ ముద్దుగుమ్మ.
‘దేవత’ సీరియల్ తో పాపులర్ అయిన ఈ అమ్మడు త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుంది. శనివారం(మార్చి 26) హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్ ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వేడుకకి చాలా మంది సీరియల్ నటులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చారు.తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే సీరియల్స్ లో ‘దేవత’ ఒకటి. ఇందులో ‘సత్య’ అనే పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాందించింది వైష్ణవి.అయితే ఆమె వ్యక్తిగత కారణాలతో ఈ సీరియల్ నుంచి తప్పుకుంది. ఇప్పుడు ఆమె పాత్రను మరొకరు చేస్తున్నారు. కేవలం సీరియల్స్‌కు మాత్రమే కాదు.. కొన్ని రోజులుగా ఇండస్ట్రీకి కూడా దూరంగానే ఉంటూ వస్తుంది వైష్ణవి. ఆ సమయంలో వైష్ణవిని పరిశ్రమ నుంచి తొలగించారంటూ పుకార్లు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. కానీ ఆ వార్తలో నిజం లేదని ఆమె క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఆమె ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.