టాలీవుడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ ఆచార్య. మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో ఈ మూవీని సంయుక్తంగా నిర్మించారు. అన్ని అడ్డకులను దాటుకుని ఎట్టకేలకు ఏప్రిల్ 29వ తేదీన విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండడంతో ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది.ఈ క్రమంలోనే ఆచార్య ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చారు. ఇక ఈ వేదికపై నుండి రాజమౌళి గురించి మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి ఎమోషనల్ అయ్యారు.
“1988లో రుద్రవీణ సినిమాకి నేషనల్ ఇంటిగ్రిటీ అవార్డు వచ్చింది. ఆ ఫంక్షన్ కి వెళ్తే.. అక్కడ నాకు మన సౌత్ ఇండియా లెజండ్స్ ఫొటోలో కనిపించలేదు. అప్పటి బాలీవుడ్ స్టార్స్ అందరి ఫోటోలు అక్కడ డిస్ ప్లే అవుతుంటే.. మన సీనియర్ యన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు ఫోటోలు కనిపించలేదు. అసలు అక్కడ టాలీవుడ్ అన్న మాటే లేదు. ఇండియన్ సినిమా అంటే.. కేవలం బాలీవుడ్ అనే విధంగా వాళ్ళు ప్రోజెక్ట్ చేశారు. కానీ.., రాజమౌళి రాకతో ఆ లెక్క మారింది. బాహుబలి, బాహుబలి-2, RRR సినిమాలతో తెలుగు సినిమా సత్తాని ప్రపంచానికి తెలియజేశాడు.అందుకని రాజమౌళిని మనం గౌరవించుకోవాలి. భవిష్యత్తులో సినీ పరిశ్రమలో ప్రాంతీయ సినిమా అనే కాన్సెప్ట్ ఉండదు. ఏ సినిమా తీసిన అది ఇండియన్ సినిమా అవుతుంది. అందుకు రాజమౌళి ప్రధాన కారణం కాబోతున్నారు. ఇలాంటి గొప్ప రూపకర్త మన చిత్ర పరిశ్రమలో ఉండడం గర్వకారణం. భారతీయ సినిమా ఒక మతం అయితే ఆ మతానికి పీఠాధిపతి” అని రాజమౌళి పై ప్రశంసలు కురిపించారు. మరి.. చిరంజీవి కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.