ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా వివాదంలో చిక్కుకున్నాడు. పోర్న్ వీడియోలను చిత్రీకరించి కొన్ని మొబైల్ యాప్స్ ద్వారా విడుదల చేస్తున్నారంటూ ముంబయి పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగుతున్న ఆయన పాడుపనికి తెర తీస్తూ అడ్డంగా బుక్కయ్యాడు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి కొన్ని కీలకమైన అంశాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇదే అంశంపై గతంలో ఆయనపై కేసు కూడా నమోదవ్వటం విశేషం.
మొబైల్ యాప్‌లలో విడుదల చేస్తున్న వీడియోలకు రాజ్ కుంద్రా ప్రముఖ పాత్ర పోషిస్తున్నాడన్నది పోలీసులు చెబుతున్న మాట. తాజాగా మరోసారి ఇలాంటి వివాదాలకు వెళ్లటం అనేది కాస్త చర్చనీయాంశంగా మారుతోంది. ఇక పోలీసుల విచారణలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఏ విధమైన సమాధానాలు చెప్పాడనేది కాస్త ఆసక్తికరంగా మారింది. ఇక ఇలాంటి పాడు పనికి పాల్పడుతుండటంతో శిల్పాశెట్టికి కొంత అవమానకరమేనని కొందరు చెబుతున్నారు. సాఫీగా సాగుతున్న శిల్పాశెట్టి ప్రయాణంలో తన భర్త ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడటం ఆమెకు కాస్త తలా నొప్పిగానే మారిందంట. మరి పాలీసులు కస్టడీలో ఉన్న ఆయనను ఏ ప్రశ్నలు అడిగారు? వాటికి ఆయన ఏం సమాధానం చెప్పాడన్నది కాస్త ఆసక్తికరంగానే మారింది. మరి ఈ వ్యవహారంలో శిల్పా శెట్టి భర్తకు ముందు ముందు ఎలాంటి తలనొప్పులు ఎదురవుతాయి చూడాలి మరి.