సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు మిగతా క్యారెక్టర్లు అన్నిటికీ ఒక వ్యక్తి వల్లే కష్టాలొస్తాయి. తనే విలన్. ఏం చేసైనా సరే.. కథానాయకుడు, ప్రతినాయకుడిని అంతం చేస్తేనే కథ సుఖాంతమవుతుంది. చాలా వరకు ఇదే ఫార్ములా కొనసాగుతుంటుంది.
సినిమాల్లో హీరో, హీరోయిన్లతో పాటు మిగతా క్యారెక్టర్లు అన్నిటికీ ఒక వ్యక్తి వల్లే కష్టాలొస్తాయి. తనే విలన్. ఏం చేసైనా సరే.. కథానాయకుడు, ప్రతినాయకుడిని అంతం చేస్తేనే కథ సుఖాంతమవుతుంది. చాలా వరకు ఇదే ఫార్ములా కొనసాగుతుంటుంది. తనొక్కడి సంతోషం కోసం అంతమందిని కష్టపెట్టే విలన్ పాత్రధారికి కష్టాలుంటాయంటే ఎవరైనా నమ్మగలరా?. సినిమాల వల్ల హీరో హీరోయిన్లకు మాత్రమే ప్రాబ్లమ్స్ ఉంటాయనుకుంటారు కానీ విలన్లకు కూడా బాధలుంటాయని చాలా మందికి తెలియదు. ఆ కష్టాలు ఎలా ఉంటాయో సీనియర్ బాలీవుడ్ యాక్టర్, పాపులర్ విలన్ గోపాల్ బేడి అలియాస్ రంజీత్ (రంజిత్) చెప్పిన మాటలు వింటే తెలుస్తుంది.
ఆయన అసలు పేరు గోపాల్ బేడి అయినా రంజిత్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1980 టైంలో ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా ఉండేవారాయన. ఎక్కువగా హీరోయిన్ల చీర లాగే సన్నివేశాల్లో నటించడంతో.. ‘రంజిత్-ది రేపిస్ట్’ అనే పేరుతో పిలుస్తూ ఆట పట్టించేవారు. ‘దోస్త్ ఔర్ దుష్మన్’, ‘ఫరేబి’, ‘నాగిన్’, ‘అమర్ అక్బర్ ఆంటోని’, ‘రాకీ’, ‘సర్ఫరోష్’, ‘బంటీ ఔర్ బబ్లీ’, ‘హౌస్‌ఫుల్ 4’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. మలయాళం, భోజ్‌పురి భాషల్లోనూ పని చేశారు. హిందీలో పలు సీరియల్స్‌తో పాటు ‘కార్నమ’, ‘ఘజబ్ తమాషా’ వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు.
అలాంటి రంజిత్.. ఒకానొక టైంలో విలన్ రోల్స్ చేసి విసిగిపోయానని చెప్పడం విశేషం. ఇటీవల ఓ ఇంటర్వూలో ఆయన మాట్లాడుతూ.. ‘‘నేను ముంబైలో ఉంటున్నప్పుడు ఓసారి అమ్మ నన్ను కలవడానికి వచ్చింది. తిరిగి వెళ్లిపోతున్నప్పుడు దగ్గరుండి ఆమెను డ్రాప్ చెయ్యడానికి కూడా కుదిరేది కాదు.. ఎందుకంటే అంత బిజీగా ఉండేవాణ్ణి.. కొద్ది రోజల తర్వాత.. ‘నీకు మాతో గడిపే సమయం కూడా ఉండదు కదా, అందుకే మేం ముంబై షిఫ్ట్ కాలేదు’ అని నాన్న అన్నారు’’ అని చెప్పుకొచ్చారు రంజిత్.