అభిజీత్ దుద్దల.. తెలుగు తెరపై వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరో. మొదటి చిత్రంతోనే సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించే అవకాశాన్ని దక్కించుకున్నాడు అభిజీత్. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన లైఫ్ ఈజ్ బ్యూటీ ఫుల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో.., హీరోగా అభిజీత్ కి మంచి లాంచింగ్ దొరికింది. కానీ.., తరువాత కాలంలో ఈ హీరో సక్సెస్ జర్నీని కంటిన్యూ చేయలేకపోయాడు. కానీ ‘పెళ్లి గోల’ వెబ్ సిరీస్ సక్సెస్ అవ్వడంతో అభి బిగ్ బాస్ సీజన్ 4 లో పార్టిసిపెంట్ గా అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఇక హౌస్ లో చాలా సెటిల్డ్ అండ్ మెచ్యూర్ ఐడియాలజీతో అభిజీత్ ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు. దీంతో.. అభిజీత్ బిగ్ బాస్ సీజన్ 4 విన్నర్ గా నిలిచాడు.
బిగ్ బాస్ టైటిల్ విన్నర్ గా నిలవడంతో ఇక అభిజీత్ కెరీర్ లో బౌన్స్ బ్యాక్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ.., అభికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. పైగా.., ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అభిజీత్ కొంత కాలంగా అసలు ఆన్లైన్ లో కనిపించకుండా పోయాడు. దీంతో అభిజీత్ కి ఏమైందన్న చర్చ మొదలయింది. దీంతో.., ఈ చర్చకి బ్రేకులు వేయడానికి స్వయంగా అభిజీత్ రంగంలోకి దిగాడు.
భుజం సమస్య కారణంగా ఆస్పత్రిలో చేరినట్టు ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రిపోర్థులతో సహా పోస్ట్ చేశాడు అభి. సోషల్ మీడియాలో నేను పోస్ట్ చేసి చాలా కాలమైందని నాకు తెలుసు. నేను మీతో ఎప్పుడూ కనెక్ట్ అయి ఉండేందుకు ఎంతగానో ప్రయత్నించాను. కానీ నా నొప్పి ఎక్కువవడం వల్ల సాధ్యం కాలేదు. వారం నుంచి భుజం గాయం మరింత బాధిస్తోంది. హాస్పిటల్కి వెళ్లాను.. త్వరలోనే తిరిగి వస్తాను’ అంటూ ఎమోషనల్గా రాసుకొచ్చాడు అభిజీత్. దీంతో.., అభిజీత్ ఈ సమస్య నుండి త్వరగా కోలుకోవాలని నెటిజన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తుండటం విశేషం.