పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ చిత్రం భీమ్లానాయక్. మళయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పనుమ్ కోషియమ్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు సాగర్ చంద్ర. త్రివిక్రమ్ డైలాగ్స్‌తో పాటు స్రీన్ ప్లే అందిస్తుండగా సితార ఎంటర్‌టైన్‌మెంట్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక సినిమా నుంచి ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ మూవీపై అంచనాలు పెరిగేలా చేస్తున్నారు యూనిట్.
అయితే ఆగస్ట్ 15న ఈ మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ విడుదల చేశారు చిత్ర బృందం. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్‌లో భీమ్లా నాయక్ అనే టైటిల్‌తో పాటు పవన్ లుంగీ కట్టుకున్న వస్తున్న ఫైటింగ్ సీన్ ఒకటి రిలీజ్ చేశారు. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. గడిచిన 24 గంటల్లో 10 మిలియన్ల వ్యూస్‌తో పాటు 727k లైక్స్‌తో అన్ని రికార్డులను సంపాదించి సరికొత్త రికార్డ్‌ను నెలకొల్పింది భీమ్లా నాయక్.
ఇక మరో విషయం ఏంటంటే..?గతంలో అత్యధిక లైక్‌లు సాధించిన సినిమాలు చూసుకున్నట్లైతే..రాధే శ్యామ్-394K, సైరా నర్సింహారెడ్డి-287K, హరిహరవీరమల్లు-219K, స్పైడర్-190K లైక్స్ సాధించిన సినిమాలను వెనక్కి నెట్టి భీమ్లా నాయక్ ఏకంగా 727k లైక్స్‌లు సాధించి టాప్‌లో దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.