బండ్ల గణేష్… ఈ పేరుకన్నా పవన్ కల్యాణ్ భక్తుడు అని చెప్పుకోవడానికే ఎక్కువ ఇష్టపడతాడు గణేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా నటుడిగా మంచి గుర్తింపే చెత్తుకున్నాడు బండ్ల గణేష్. తర్వాత కొన్ని సినిమాలు నిర్మించి.. నిర్మాతగా మారాడు. మధ్యలో రాజకీయాల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పుడు మళ్లీ వెండితెరపై మెరవబోతున్నాడు బండ్ల గణేష్. క్యారెక్టర్ ఆర్టిస్టుగానో, కమెడియన్‌గానో కాదు. ఈసారి హీరోగానే బండ్ల గణేష్ అభిమానులను అలరించనున్నాడు.
సినిమా కోసం మేకోవర్ కూడా స్టార్ట్ చేసేశాడు. తమిళంలో హిట్ కొట్టి, జాతీయ అవార్డులు అందుకున్న థ్రిల్లర్ ‘ఒత్త సెరుప్పు సైజ్ 7’కు తెలుగులో రీమేక్‌తో బండ్ల గణేష్ హీరోగా మారబోతున్నాడు. తమిళంలో ఆర్.పార్తిబన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించి, నటించిన మూవీ ‘ఒత్త సెరప్పు సైజ్ 7’. తెలుగులో వెంకట్ చంద్ర దర్శకత్వంలో స్వాతీ చంద్ర నిర్మించనున్న ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభం కానుంది.