బలగం సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలోకి అభిమానులను రప్పిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బలగం సినిమాను ఊరంత ఒకే దగ్గర కూర్చుని చూస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటూ ఉంటాయి. ఇలా ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల హృదయాలను హత్తుకుని, కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమా ఏదైనా ఉంది అంటే అది ఒక్క బలగం అనే చెబుతారు. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలై.. సంచలనం సృష్టించింది ఈ బలగం. మానవ సంబంధాలను గుండెలకు హత్తుకునేలా తెరకెక్కించాడు డైరెక్టర్ వేణు. ఇక ఈ సినిమా ఓటీటీలోకి వచ్చినప్పటికీ థియేటర్లలోకి అభిమానులను రప్పిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బలగం సినిమాను ఊరంత ఒకే దగ్గర కూర్చుని చూస్తున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. దాంతో అది ఏ ఊరు అంటూ ఆరాతీస్తున్నారు నెటిజన్లు.
బలగం.. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కుమార్తె, కొడుకును నిర్మాతలుగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. జబర్దస్త్ వేణు మెగా ఫోన్ పట్టి తెరకెక్కించిన సినిమా. చిన్న చిత్రంగా విడుదలై.. టాలీవుడ్ లో ప్రభంజనం సృష్టించింది. కలెక్షన్ల పరంగా.. ప్రశంసల పరంగా బలగం సూపర్ హిట్ గా నిలిచింది. అచ్చమైన పల్లెటూరు మనుషుల స్వభావాలు, వారి పట్టింపులు, ప్రేమలను, చావుకు సంబంధించిన సంప్రదాయలను ఉన్నది ఉన్నట్లుగా చూపించాడు డైరెక్టర్ వేణు. ఇక తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ఇక్కడి జనాలు అందరు బలగం సినిమాకు కనెక్ట్ అయ్యారు. దాంతో ఊర్లకు ఊర్లే.. థియేటర్లకు తరలి ఈ సినిమాను చూస్తున్నాయి.
ఇక ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో.. ఊర్లలో ఎల్ఈడీ స్క్రీన్స్ లను ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు చూపిస్తున్నారు ప్రజాప్రతినిధులు. తాజాగా కరీంనగర్ జిల్లా, గంగాధర మండలం, ఉప్పర మాల్యాల గ్రామంలో ఆ ఊరి ప్రజాప్రతినిధి బలగం సినిమాను ఊరి జనాలకు ఫ్రీగా చూపించాడు. గ్రామంలో ఓ చోట ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయించి ఊరు జనాల్ని అందరిని పిలిచి మరీ బలగం సినిమాను చూపించాడు. మీరు ఇక్కడ చూస్తున్న ఫోటోలు అందుకు సంబంధించినవే. పురాతన హిందూ సంప్రదాయం అయిన పిట్ట ముట్టుడు అనే కథాంశంతో బలగం సినిమాను తెరకెక్కించాడు డైరెక్టర్ వేణు. దాంతో ఈ సినిమా పల్లెటూర్లలోని ప్రతీ ఒక్కరికి కనెక్ట్ అవుతోంది. ఒక్క కరీంనగరే కాకుండా నిజామాబాద్ లోని హసన్ కొత్తూర్ అనే గ్రామంలో సైతం ఊరి జనం మెుత్తం ఒక్కచోట చేరి బలగం సినిమాను చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి బలగం సినిమా చూడ్డానికి ఊరు మెుత్తం ఒక్కదగ్గరికి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
పాత రోజులను గుర్తు చేస్తున్న బలగం సినిమా
నిజామాబాద్ జిల్లా హసకోత్తుర్ గ్రామ ప్రజలు మొత్తం ఒక్క చోట చేరి బలగం సినిమా చూస్తున్న గ్రామస్తులు
చిన్ననాటి రోజులు గుర్తు చేస్తూ గ్రామ పంచాయతీల ముందు పెద్ద తెరలు ఏర్పాటు చేసుకుని బలగం చూస్తున్నారు#Balagam #Balagamonprime pic.twitter.com/dU1iqAjsIO
— Telugu Scribe (@TeluguScribe) March 30, 2023