తెలుగు ఇండస్ట్రీలో దాసరి నారాయణ తర్వాత ఏ విషయం అయినా తన బాధ్యతగా స్వీకరిస్తూ ముందుకు సాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. కరోనా సమయంలో సినీ కార్మికులకు అండగా నిలిచారు.. ఇండస్ట్రీలో ఏ సమస్యలు వస్తున్నా దగ్గరుండి పరిష్కరిస్తున్నారు. ఇటీవల ఏపిలో టికెట్ల విషయంలో గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ తరుపు నుంచి రెండు పర్యయాలు ముఖ్యమంత్రి జగన్ ని కలిశారు. మొత్తానికి సినిమా టికెట్ల విషయంలో ఏపీ సర్కార్ సానుకూలంగా స్పందించింది.
ఇదే సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ కోసం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ఏపి, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతించాయి. ఇందుకు కోసం దర్శకుడు రాజమౌళి తెలుగు రాష్ట్రాల మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపి ప్రభుత్వంతో టికెట్ ధరల పెంపుకోసం చర్చించామని.. అదే సమయంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ కి ఉన్న సాన్నిహిత్యం టెకెట్ల రేట్లు పెరగడానికి ఎంతో దోహద పడిందని అన్నారు.
టికెట్ల ధర పెరగడానికి చిరంజీవి తెర వెనుక ఉంటూ ఎంతో కృషి చేశారని అన్నారు. అయితే కాచే చెట్టుకు రాళ్ల దెబ్బ అన్నట్టు సీఎం జగన్ ని చిరంజీవి కలిసిన తర్వాత చాలా మంది ఆయన్ని నిందించారని.. ఎన్నో మాటలు అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమ్ముల్ని నెగ్గించడానికి ఆయన తగ్గారని అన్నారు రాజమౌళి.