సినిమా పరిశ్రమలో లవ్, రిలేషన్, డేటింగ్, బ్రేకప్, పెళ్లి, డైవర్స్ చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కగా.. మరి కొందరు ఆ దిశగా అడుగులెయ్యడానికి రెడీ అవుతున్నారు.
సినిమా పరిశ్రమలో లవ్, రిలేషన్, డేటింగ్, బ్రేకప్, పెళ్లి, డైవర్స్ చాలా కామన్. ముఖ్యంగా బాలీవుడ్‌లో అయితే ఇలాంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ విడాకుల కోసం కోర్టు మెట్లెక్కగా.. మరి కొందరు ఆ దిశగా అడుగులెయ్యడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల నటి రుక్సార్ రెహమాన్, దర్శక నిర్మాత ఫరూఖ్ కబీర్ దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించారు. అమీషా పటేల్, డైరెక్టర్ విక్రమ్ భట్‌తో డేటింగ్ వల్లే తన కెరీర్ నాశనమైందంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. కట్ చేస్తే ఇప్పుడు మరో బ్రేకప్ వ్యవహారం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. అనుష్క శర్మ సోదరుడు కర్ణేష్ శర్మ, నటి త్రిప్తి డిమ్రి బ్రేకప్ న్యూస్ వైరల్ అవుతుంది.
నిర్మాతగా హిందీలో పలు మూవీస్, వెబ్ సిరీస్ చేసిన కర్ణేష్ శర్మ కొద్ది కాలంగా హీరోయిన్ త్రిప్తి డిమ్రితో డేటింగ్ చేస్తున్నాడు. ఈ కారణంగానే తను ఎక్కువ పాపులర్ అయ్యాడు. కొన్నాళ్లు ఎంచక్కా ఎంజాయ్ చేసిన ఈ లవ్ బర్డ్స్ ఇప్పుడు తమ రిలేషన్‌ని కట్టి కబోర్డ్‌లో పడెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అనుష్క, సోదరుడితో కలిసి క్లీన్ స్లేట్ ఫిలింస్ అనే బ్యానర్ స్టార్ట్ చేసింది. మూవీస్, సిరీస్ చేసి మంచి ప్రొడక్షన్ హౌస్‌గా పేరు సంపాదించారు. ఇటీవలే నిర్మాణ సంస్థకు సంబంధించిన పూర్తి బాధ్యతలను అన్నయ్యకు అప్పగించిందామె.
అంతే కాదు.. వారి పిక్స్ లాంటి మెమరీస్ అన్నీ డిలీట్ చేసేశారు. ఇదే ఈ వార్తలకు మరింత బలాన్నిచ్చింది. త్రిప్తి ‘బుల్‌బుల్’, ‘మామ్’, ‘లైలా మజ్ను’ లాంటి చిత్రాల్లో నటించింది. ఫస్ట్ ఫిలిం అప్పుడే అనుష్క శర్మ బ్రదర్‌తో రిలేషన్ షిప్ స్టార్ చేసింది. ఇప్పుడు తమ మూడేళ్ల బంధానికి స్వస్తి చెప్పుకుని బాలీవుడ్ బ్రేకప్ జంటల లిస్టులో యాడ్ అయిపోయారు. త్రిప్తి – కర్ణేష్ బ్రేకప్ చేసుకున్నారనే న్యూస్ హిందీ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతుంది.