షోల్లోకి ఎంతోమంది యాంకర్స్ వస్తుంటారు, పోతుంటారు.. అనసూయ మాత్రం లోకల్. ఇది ఎందుకు చెబుతున్నాం అంటే.. ఇప్పుడు ఆమె షోల్లో కనిపించడం తగ్గిపోవచ్చు. కానీ అనసూయ హవా మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఆమె గురించి ఏ చిన్న వార్త కావొచ్చు, ఓ వీడియో కావొచ్చు ఏదొచ్చినా సరే ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ. అందుకు తగ్గట్లే ఆమె కూడా సోషల్ మీడియా పోస్టులతో ఎప్పటికప్పుడు టచ్ లోనే ఉంటుంది. ఇక కొన్నిసార్లు అనసూయ పోస్ట్ చేయనప్పటికీ కొన్ని వీడియోస్ వైరల్ గా మారుతుంటాయి.
ఇక వివరాల్లోకి వెళ్తే.. అనసూయ గురించి మీకు స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ స్క్రీన్ పై స్టార్ హీరోయిన్లకు ఎంత క్రేజ్ ఉంటుందో.. స్మాల్ స్క్రీన్ పై అనసూయకు అంతకు మించిన క్రేజ్ సొంతం. తన గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది. ఆమె పోస్ట్ చేసిన ఫొటోలకు నెటిజన్స్ కూడా అలానే స్పందిస్తూ ఉంటారు. కొందరు ఆమెని ట్రోల్ చేస్తూ ఉంటారు. ఏదైనా సరే అనసూయ మాత్రం ఎప్పుడూ న్యూస్ లో ఉంటుంది. రీసెంట్ గా ‘జబర్దస్త్’ యాంకర్ గా తప్పుకొన్న అనసూయ.. సినిమాల్లో సైడ్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తూ బిజీగా ఉంది.
మరోవైపు అనసూయకు ట్రావెలింగ్ అన్నా సరే చాలా ఇష్టం. ఎప్పటికప్పుడు భర్త, పిల్లలతో కలిసి టూర్స్ వేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా అనసూయ… ఇటీవల ట్రావెలింగ్ చేస్తూ రిలాక్స్ కావడం కోసం చిట్యాలలోని ఓ ప్లాజా దగ్గర ఆగింది. ఇలా ఆమె హోటల్ కి వెళ్లిందో లేదో అక్కడ వెయిటర్స్ అందరూ ఆమెని చూసి తెగ ఎగ్జైట్ అయిపోయారు. ఆమెని ఎంటర్ టైన్ చేయడానికి ప్రయత్నించారు. ఇక అనసూయకు కూడా ఊపు వచ్చినట్లుంది. ఈ క్రమంలోనే హోటల్ వెయిటర్స్ తో కలిసి అనసూయ కూడా.. ‘రా రా రక్కమ్మ’ పాటకు అదిరిపోయే స్టెప్పులేసింది. ఇప్పుడు ఆ వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.