అనసూయ మరోసారి బిగ్ స్క్రీన్ పై హాట్ నెస్ తో రెచ్చిపోయేందుకు రెడీ అయిపోయింది. తాజాగా అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇంతకీ ఏంటి విషయం?
నార్మల్ గా లేడీ యాక్టర్స్ కి వయసు పెరుగుతున్న కొద్దీ అందం తగ్గిపోతుందని అంటారు. అదేంటో అనసూయకి మాత్రం ఏజ్ తోపాటు గ్లామర్ విపరీతంగా పెరిగిపోతోంది. ‘జబర్దస్త్’లో ఉన్నప్పుడు ఆమెని చూసి అబ్బా అనుకున్నాం. ఇక ‘రంగస్థలం’లోని రంగమ్మత్త రోల్ చూసి సూపర్ అనుకున్నాం. ఆ తర్వాత ఓ తమిళ సినిమాలో వేశ్య పాత్రలో నటిస్తుందని అన్నారు. ఇప్పుడు ఇవన్నీ కాదన్నట్లు మరోసారి బోల్డ్ గా కనిపించి హీట్ పెంచేందుకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకీ ఏంటి సంగతి?
అసలు విషయానికొచ్చేస్తే.. అనసూయ అంటే కాంట్రవర్సీలతో పాటు హాట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్. ‘జబర్దస్త్’లో యాంకర్ గా ఉన్నప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని అందరి మనసులు కొల్లగొట్టింది. ఆ తర్వాత ‘రంగస్థలం’, ‘పుష్ప’ సినిమాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించిన ఆకట్టుకుంది. కొన్నాళ్లముందు ‘దర్జా’ మూవీలో విలన్ గా కనిపించి అలరించింది. ప్రస్తుతం తమిళంలో తీస్తున్న ‘ఫ్లాష్ బ్యాక్’ మూవీలో బోల్డ్ నెస్ కి మించి అనేలా ఉంది. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికీ వైరల్ అవుతున్నాయి.
అనసూయ ప్రస్తుతం ‘విమానం’ అనే ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. జూన్ 9న ఇది థియేటర్లలోకి రానుంది. తాజాగా అనసూయ పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రని పరిచయం చేస్తూ చిన్న వీడియో బిట్ రిలీజ్ చేశారు. సుమతి అనే మహిళగా కనిపించిన అనసూయ.. కళ్లకు కాటుక, మెడపై పౌడర్, ఒంపుసొంపులు కనిపించేలా చీరకట్టుతో దర్శనమిచ్చింది. ఈ గెటప్-సెటప్ చూస్తుంటే వేశ్య పాత్ర ఏమైనా చేస్తుందా అనే డౌట్ వస్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం అనసూయ ఫ్యాన్స్ కి పండగే. నార్మల్ గా రెచ్చిపోతుంది. ఇక ఇలాంటి రోల్స్ అంటే బోల్డ్ నెస్ తో పిచ్చెక్కించేయడం గ్యారంటీ. మరి అనసూయని ఇలా చూసిన తర్వాత మీకేం అనిపించింది? కింద కామెంట్ చేయండి.