అనసూయ భరద్వాజ్.. బుల్లితెరపై తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న యాంకర్. బుల్లితెరపై యాంకర్ సుమ తర్వాత అతంటి ఫాలోయింగ్, ఫ్యాన్ బేస్ అనసూయ సొంతం అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అటు యాంకరింగ్ చేస్తూనే.. మరోవైపు వెండితెరపై విభిన్న పాత్రల్లో మెరిపిస్తూ ఉంటుంది. రంగస్థలం సినిమాలో రంగమత్తగా మెప్పించిన అనసూయ ఆ తర్వాత చాలా మంది పాత్రల్లో మెప్పించింది. ఇటీవల పుష్ప సినిమాలో దాక్షాయణిగా నెగెటివ్ రోల్ ని సైతం రక్తి కట్టించింది. అలా చాలా సెలెక్టివ్ గా నటనకు ప్రాధాన్యముండే పాత్రలు ఎంచుకుంటూ ఓ ప్రత్యేక గుర్తంపును సొంతం చేసుకుంది.
ఇదీ చదవండి: బుల్లి నిక్కర్లో కార్తీకదీపం మోనిత.. గోవా బీచ్ లో సందడి!
అనసూయకు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ బేస్ చాలా ఎక్కువ. ఆమె కోసం సెపరేట్ గా పదుల సంఖ్యలో ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. అనసూయ ఎప్పుడూ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుంది. తన ప్రాజెక్టుల గురించి వివరాలు చెప్పడం మాత్రమే కాకుండా, సామాజిక అంశాలపై కూడా తనదైనశైలిలో స్పందిస్తుంటుంది. తాజాగా బ్లూ డ్రెస్ లో తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫొటోలు కుర్రకారును ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అచ్చు బుట్టబొమ్మలా ఉన్నావ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంక సినిమాల విషయానికి వస్తే పుష్ప-2, గోపిచంద్ పక్కా కమర్షియల్, రంగ మార్తాండ సినిమాల్లో అనసూయ ప్రేక్షకులను అలరించనుంది. అనసూయ రీసెంట్ ఫొటో షూట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.