Amala Akkineni Open Letter to Akkineni Fans: అఖిల్ 'ఏజెంట్'పై అమల రెస్పాండ్ అయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అక్కినేని ఫ్యాన్స్ కి ఓపెన్ లెటర్ కూడా రాశారట! దీంతో ఇదికాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది.
అఖిల్ ‘ఏజెంట్’ తాజాగా థియేటర్లలోకి వచ్చేసింది. ఓ మాదిరి అంచనాలతో బరిలో దిగినప్పటికీ.. రిలీజ్ తర్వాత ఊహించని రెస్పాన్స్ అందుకుంది. దాదాపు ప్రతిఒక్కరూ పెదవి విరుస్తున్నారు. నార్మల్ ఆడియెన్స్ చెప్పిన దానిగురించి పక్కనబెడితే.. అక్కినేని ఫ్యాన్స్ అయితే అఖిల్ విషయంలో చాలా బాధపడుతున్నారు. సినిమా చూసి తట్టుకోలేక తమ అసహనాన్ని బయటపెడుతున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ తల్లి అమల.. సినిమా చూశారు. తన రియాక్షన్ చెప్పడంతో పాటు ‘ఏజెంట్’పై వస్తున్న ట్రోల్స్ కి కూడా స్పందించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘ఏజెంట్’తో కలిపి అఖిల్ ఇప్పటివరకు ఐదు సినిమాలు చేశాడు. కానీ అవన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి! తాజాగా ‘ఏజెంట్’ రిలీజ్ సందర్భంగా సినిమా చూసిన పలువురు అక్కినేని ఫ్యాన్స్.. ట్విట్టర్ స్పేస్ లో మాట్లాడుకున్నారు. రిజల్ట్ పై తమ తమ అభిప్రాయాల్ని వ్యక్తపరిచారు. ఈ క్రమంలోనే అఖిల్ కి అభిమానిగా ఉండటం కష్టమైపోతుందని పలువురు ట్వీట్స్ కూడా చేశారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి అమల దగ్గరు చేరిందని, దీంతో ఆమె.. అక్కినేని ఫ్యాన్స్ ని ఉద్దేశిస్తూ ఓ లెటర్ రిలీజ్ చేశారని తెలుస్తోంది. ఇప్పుడు అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది.
‘ట్రోలింగ్ అనేది ఎప్పుడూ ఉండేదే. ఎందుకలా చేస్తారనేది నేను అర్థం చేసుకున్నాను. నిన్న నేను ‘ఏజెంట్’ చూశాను. పూర్తిగా ఎంజాయ్ చేశాను. సినిమాలో లోపాలున్నాయి. కానీ మీరు ఓపెన్ మైండ్ తో చూస్తే ఆశ్చర్యపోతారు. థియేటర్ లో నేను మూవీ చూస్తున్న టైంలో సగంమంది లేడీస్ ఉన్నారు. యాక్షన్ సీన్స్ టైంలో అరుస్తూ, కేకలేస్తూ వాళ్లు బాగానే ఎంజాయ్ చేశారు. నేను ఒకటే చెప్పగలను. అఖిల్ తర్వాత చేయబోయే సినిమా ఇంకా బాగుంటుంది.’ అని అమల చెప్పుకొచ్చారట. మరి కొడుకు సినిమాపై అమల పలు వ్యాఖ్యలు చేశారనే దానిపై మీరేం అనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.
Sorry #Agent 👎 Completely Worthless 💯@AkhilAkkineni8, next time ayina proper content oriented film deliver cheyi. Asalu output release ki mundu chusava leda em teesina fans ey kada chusestam ani guddi nammakama? Worstttt 😐
Inkaa moyyadaniki maaku opika ledu done with it 🙏
— Deepak (@deepaksomisetty) April 28, 2023
Prapancham Motham Manalani Tappu padtuna Amma Matram Yepudu mana Venaka eh Untadi 🙏❤️ @amalaakkineni1 garu heartfelt letter#Agent @AkhilAkkineni8 pic.twitter.com/NvZ98khuLH
— Vinayak (@Vinayak3021) April 29, 2023