తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది బాలీవుడ్ బ్యూటీలు తమ అందచందాలతో సందడి చేశారు. తెలుగు ఇండస్ట్రీలో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా నటించిన ‘ఝుమ్మందినాదం’ చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యింది. అంతకు ముందు బాలీవుడ్ లో ఈ బ్యూటీ మోడలింగ్ చేసింది. తాప్సీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్ డేట్ సోషల్ మాద్యమాల్లో షేర్ చేస్తుంది.
తాజాగా తన చిన్ననాటి జ్ఞాపకానికి చెందిన ఓ అపురూపమైన ఫోటో ఫ్యాన్స్ కి షేర్ చేసింది. స్కూల్లో నిర్వహించిన ఓ రన్నింగ్ రేసులో తాప్సీ ఫస్ట్ ప్రైజ్ అందుకోవడం ఆ ఫొటోలో చూడొచ్చు. చిన్నప్పుడు చాలా వేగంగా పరిగెత్తే దాన్ని అంటూ ఆ ఫొటోపై తాప్సీ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా అనబెల్ సేతుపతి అనే చిత్రంలో నటించింది.
హీరోయిన్ కు ప్రాధాన్యం ఉన్న చిత్రాలతో తాప్సీ తన నటనా ప్రతిభను చాటుకుంటోంది. అంతే కాదు టీమిండియా మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్న శభాష్ మిథు చిత్రంలో తాప్సీ లీడ్ రోల్ పోషిస్తోంది. రష్మీ రాకెట్, జనగణమన వంటి చిత్రాల్లోనూ నటిస్తోంది. తాజాగా ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
बहुत तेज़ दौड़ती है …… बचपन से ।#CantKeepCalm #OnYourMarks pic.twitter.com/43BLFu1HUs
— taapsee pannu (@taapsee) September 18, 2021