దృశ్యం సినిమా నటి తల్లి కాబోతుంది అన్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అయితే అందుకు సంబంధించిన ఆ నటి బేబీ బంప్ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.
సాధారణంగా చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన ఏ చిన్న విషయాలను అయినా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే కొంత మంది సెలబ్రిటీలు మాత్రం తమకు సంబంధించిన విషయాలను చాలా గుట్టుగా ఉంచుతుంటారు. అయితే వారు ఎంత గుట్టుగా ఉంచినాగానీ అవి ఏదో ఒక సందర్భంలో బయటపడక తప్పదు. ఇప్పడు జరిగింది కూడా ఇదే. దృశ్యం సినిమా నటి తల్లి కాబోతుంది అన్న వార్త ప్రస్తుతం ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. అయితే అందుకు సంబంధించిన ఆ నటి వీడియో సైతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఆ నటికి సంబంధించిన బేబీ బంప్ వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. మరి తల్లి కాబోతున్న ఆ దృశ్యం నటి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇశితా దత్తా.. 2012లో వచ్చిన చాణక్యుడు చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత 2015లో బాలీవుడ్ లో వచ్చిన దృశ్యం చిత్రంలో అజయ్ దేవ్ గన్ కు కూతురుగా నటించింది. ఇక ఈ చిత్రం ద్వారా నటిగా మంచి గుర్తింపు దక్కించుకుంది ఇశితా. ఇక 2022లో వచ్చిన దృశ్యం 2 చిత్రంలో కూడా నటించి దేశవ్యాప్తంగా క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ క్రమంలోనే ఇశితా దత్తా కు చెందిన ఓ క్రేజీ న్యూస్ బాలీవుడ్ లో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? ఇశితా త్వరలోనే తల్లి కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇక ఇందుకు సంబంధించి ఇశితా బేబీ బంప్ తో ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ముంబై విమానాశ్రయంలో ఎక్కడికో వెళ్తు కెమెరా కంటికి చిక్కింది. ఆ సమయంలో ఆమె ప్రెగ్నెంట్ గా ఉన్నట్లు బేబీ బంప్ ను చూస్తేనే తెలుస్తోంది. ఇక 2017లో వత్సల్ సేథ్ ను పెళ్లి చేసుకుంది ఇశితా. అయితే ఇశిత గానీ ఆమె భర్త వత్సల్ సేథ్ గా ప్రెగ్నెంట్ విషయాన్ని ధృవీకరించలేదు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు తల్లి కాబోతున్న ఇశితకు అభినందనలు తెలుపుతున్నారు. బాలీవుడ్ బ్యూటీ తనూశ్రీ దత్త సోదరే ఈ ఇశితా దత్త.