సినిమాలో సహయక పాత్రలో నటించి.. అనేక మంది నటీమణులు గుర్తింపు సంపాదించారు. హీరో హీరోయిన్ల స్థాయిలో వారిని కూడా ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు. అలా సహయక పాత్రలో నటించి.. మంచి గుర్తింపు సంపాదించిన వారిలో కల్పిక, గణేష్, బాలకృష్ణలు ఉన్నారు. ఇటీవల కొంతకాలం నుంచి వీరిద్దరి మధ్య పెద్ద యుద్దమే జరుగుతోంది. తన యూట్యూబ్ ఛానెల్ లో ధన్య గురించి కల్పిక సంచలన ఆరోపణలు చేసింది. గతంలోనే పెళ్లై.. పిల్లలు ఉన్న కోలీవుడ్ డైరెక్టర్ బాలాజీ మోహన్ ను ధన్య రహస్యంగా రెండో వివాహం చేసుకున్నట్లు చెప్పి షాకిచ్చింది. అయితే ఈ విషయాన్ని వాళ్లిద్దరు బయట పెట్టలేదంటూ కల్పిక షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ తరువాత ఆ వీడియో డిలీట్ చేయండి జరిగింది. తాజాగా కల్పిక మాటలపై ధన్య బాలకృష్ణ ఫైర్ అయ్యింది. తాగుబోతు, తిరుగుబోతూ అంటూ కల్పికపై ధన్య సంచలన కామెంట్స్ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
నటి కల్పిక.. అనేక సినిమాలో సహయక పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాందించి. అలానే ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో సినిమాలకు సంబంధించిన విశేషాలను షేర్ చేసుకుంటూ ఉంటుంది. కల్పిక తన యూట్యూబ్ ఛానల్ ద్వారా సినిమాల గురించి మాత్రమే కాకుండా నటీనటుల గురించి కూడా ఆసక్తికరమైన కామెంట్లు చేస్తుంటుంది. అలానే ఇటీవల ధన్య బాలకృష్ణన్ గురించి కూడా పలు ఆసక్తికరమైన ఆరోపణలు చేసింది. ప్రముఖ తమిళ దర్శకుడు బాలాజీ మోహన్ ను ధన్య బాలకృష్ణ ఏడాది క్రితం రహస్యంగా పెళ్లి చేసుకుందని కల్పిత అన్నారు. భార్యతో విడాకులు తీసుకున్న బాలాజీ మోహన్‌కు ఇది రెండో పెళ్లని కూడా కల్పిక పేర్కొన్నారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చిత్ర పరిశ్రమలో చర్చకు దారి తీసింది.
అయితే పోస్ట్ చేసిన ఈ వీడియోలు ఉన్నట్టుండి కల్పిక యూట్యూబ్ ఛానల్ లో నుంచి డిలీట్ అయ్యాయి. ఆ వీడియో డిలీట్ కావడానికి ధన్యనే కారణమంటూ కల్పిక ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇన్నాళ్లు నువ్వు నా ఫోన్‌ను బ్లాక్ చేసి ఉంచావు. నీకు సంబంధించిన విషయాలు బయటపెట్టేసరికి అన్‌బ్లాక్ చేసి.. రాత్రి వరుసగా కాల్స్ చేశావు. ఏం చేసుకుంటావో చేసుకో.. నీ పవర్ చూపించి నా వీడియోను యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించావు. నా పవర్ చూపిస్తే భస్మమైపోతావు. కోలీవుడ్ స్టార్ హీరో అండతో నా వీడియోను డిలీట్ చేయించావు” అంటూ కల్పిక ఫైర్ అయ్యింది. అయితే కల్పిక మాటలపై తాజాగా ధన్య బాలకృష్ణ స్పందించినట్లు సమాచారం. ధన్య కూడా ఓ రేంజ్ లో కల్పికపై ఫైర్ అయినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. కల్పిక పెద్దతాగుబోతని, స్మోకింగ్ కూడా ఎక్కువగాచేస్తుంటుందని ధన్యబాలకృష్ణ కల్పితపై ఆరోపణలు చేసింది.
“గంజాయి కొట్టి.. ఆ మత్తులో ఏది పడితే అది వాగుతూ ఉంటుంది. ఎప్పుడూ.. గంజాయి మైకంలోనే ఉంటుంది. తెలుగమ్మాయి అనే ట్యాగ్ ను వాడుకుని పాపులర్ అయినట్టు ఫీలవుతుంది. ఆమె చేసిన ఆరోపణలు ఆమెకే గుర్తుండవు. ఇక అసలు నేనే పట్టించుకోను. మీరు కూడా ఇలాంటి పనికిమాలిన విషయాలను పట్టించుకోకండి. మీ విలువైన సమయాన్ని వృథా చేసుకోవద్దు” అని ధన్య బాలకృష్ణ తెలిపారంట. ధన్య హీరోయిన్ గా కూడా పలు సినిమాలు చేసింది. ఇక కల్పిక ఇటీవల యశోద సినిమాలో మెరిసింది. అయితే వీరిద్దరి మధ్య వివాదం రోజూ రోజూకు బాగా ముదురిపోతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరీ వీరి ఇష్యూపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.