ఆమె ప్రముఖ హీరోయిన్. పలు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సరిగ్గా ఇలాంటి టైంలో ఆమె తల్లి పాపకు జన్మనిచ్చింది. ఇదికాస్త ఇప్పుడు వైరల్ న్యూస్ అయిపోయింది.
అతడికి 25 ఏళ్లు, ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉంటాడు. తన లవ్ గురించి ఇంట్లో చెబుదామనుకుంటాడు. అదే టైంలో అతడి తల్లి ప్రెగ్నెంట్ అని తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది 2018లో వచ్చిన హిందీ సినిమా ‘బదాయి హో’ స్టోరీ. ఈ మూవీ చాలామందిని ఎంటర్ టైన్ చేసింది. మనస్పూర్తిగా నవ్వుకునేలా చేసింది. అయితే ఇలాంటిది రియల్ లైఫ్ లో జరిగింది అంటే మీరు నమ్మకపోవచ్చు? కానీ ఓ సీరియల్ హీరోయిన్ తల్లి విషయంలో అది కూడా మన దక్షిణాదిలో ఇలా జరిగింది. దీంతో ఇది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. కేరళకు చెందిన ఆర్య పార్వతి మలయాళంలో చాలా పాపులారిటీ తెచ్చుకున్న సీరియల్ నటి. ‘చెంబట్టు’ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ఆ తర్వాత ‘ఇలయవళ్ గాయత్రి’ ధారావాహికలోనూ నటించి పేరు తెచ్చుకుంది. ఓవైపు నటిగా చేస్తూనే మరోవైపు మోహినీఆట్టం ప్రదర్శనలు కూడా ఇస్తూ ఫేమస్ అయింది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈమె.. ఎప్పటికప్పుడు తన విషయాల్ని షేర్ చేసుకుంటూ ఉంటుంది. తాజాగా తన తల్లి పాపకు జన్మనిచ్చినట్లు చెప్పి అందరికీ షాకిచ్చింది.
ఇక్కడ విశేషం ఏంటంటే.. ఆర్య పార్వతి వయసు 23 ఏళ్లు. ఆమె తల్లి వయసు 47 ఏళ్లు. ఇలా లేటు వయసులో ఓ నటి తల్లి బిడ్డకు జన్మనివ్వడం సర్వత్రా చర్చనీయాంశమైంది. విదేశాల్లో ఇది చాలా నార్మల్ విషయం అయినప్పటికీ మన దగ్గర మాత్రం ఇది కాస్త కొత్తనే చెప్పాలి. అయితే తన చెల్లిలిని ఎత్తుకున్నందుకు చాలా ఆనందంగా ఉందని నటి ఆర్య పార్వతి చెప్పుకొచ్చింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి యువ నటి తల్లి బిడ్డకు జన్మనివ్వడంపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.