ప్రస్తుతం టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు పలు రకాల వ్యాధులతో పోరాడుతున్న సంగతి మనకు తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. తాజాగా టాలీవుడ్ జేజమ్మ అనుష్క కు ఓ అరుదైన వ్యాధి ఉన్నట్లుగా సమాచారం.
అనుష్క శెట్టి.. తన అందంతో, అభినయంతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది జేజమ్మ. నిశ్శబ్దం సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించలేదు స్వీటీ. ఈ నేపథ్యంలోనే కాస్త బొద్దుగా మారడంతో అనుష్కకు అవకాశాలు కూడా తగ్గుముఖం పట్టాయి. దాంతో అసలు బయట కనిపించడమే మానేసింది స్వీటి. తాజాగా అనుష్కకు సంబంధించిన ఓ వార్త ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే? అనుష్క ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో కొందరు హీరోయిన్లు పలు రకాల వ్యాధులతో పోరాడుతున్న సంగతి మనకు తెలిసిందే. స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దాంతో చాలా మంది నటీమణులు తమకు ఉన్న వ్యాధులను బయటపెడుతూ వస్తున్నారు. తాజాగా టాలీవుడ్ జేజమ్మ అనుష్క తనకూ ఓ అరుదైన వ్యాధి ఉన్నట్లుగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అనుష్కకు ఉన్న వ్యాధి ప్రాణాంతకమైనది అయితే కాదులెండి. ఇంతకి స్వీటికి ఉన్న వ్యాధి ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి అనుష్క నవ్వడం స్టార్ట్ చేస్తే.. ఆపకుండా కంటిన్యూస్ గా 15-20 నిమిషాలు నవ్వుతుంది అంట. ఈ విషయాన్ని తనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇక స్వీటి నవ్వడం స్టార్ట్ చెయ్యగానే షూటింగ్ ను కొద్దిసేపు ఆపేస్తారంట. ఆ టైమ్ లో అందరు బ్రేక్ తీసుకుని టీలు, టీఫిన్స్ తింటారని చెప్పుకొచ్చింది జేజమ్మ. అయితే నవ్వడం మంచిదేగా స్వీటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఇక ప్రస్తుతం అనుష్క, నవీన్ పొలిశెట్టి కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు మిస్ శెట్టి-మిస్టర్ పొలిశెట్టి అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ షూటింగ్ లో బిజీబిజీగా ఉంది అనుష్క. స్వీటీ బర్త్ డే కానుకగా గతంలో వర్కింగ్ స్టిల్స్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. మరి అనుష్కకు ఉన్న ఈ నవ్వుల డిసీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.