మరో స్టార్ నటుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. గత రెండు వారాల నుంచి ఆయన్ని హాస్పిటల్లోనే ఉండటంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన తర్వగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉండటం… ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఇక 1971లో కెరీర్ స్టార్ట్ చేసిన ఆయన.. ఇప్పటివరకు దాదాపు 90 సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బాలీవుడ్ లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ గోఖలే.. గతంలో వచ్చిన ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ సినిమాలో హీరోయిన్ ఐశ్వర్యారాయ్ కి తండ్రిగా నటించారు. భూల్ భులయా, దిల్ సే, దే ధనాధన్, హిచ్కీ, నిక్కమ్మా, మిషన్ మంగళ్ లాంటి చిత్రాల్లోనూ కనిపించి మెప్పించారు. ఇప్పుడు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో 15 రోజుల క్రితం చేర్చారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.
Veteran actor Vikram Gokhale was admitted to Pune’s Deenanath Mangeshkar Hospital a few days back. His condition remains critical
(File pic) pic.twitter.com/VparQPEdb9
— ANI (@ANI) November 23, 2022