సెలబ్రిటీలు ఎవరైనా సరే.. కొత్త కారు కొన్నా, ఇల్లు కట్టినా, రిలేషన్ లో అడుగుపెట్టినా చెబుతుంటారు. ప్రతి విషయాన్ని ఫ్యాన్స్ తో పంచుకుంటూ ఉంటారు. ఇక సదరు సెలబ్రిటీలు పెళ్లి చేసుకుంటే, దాన్ని గ్రాండ్ గా ఓ సెలబ్రేషన్స్ లా జరుపుతారు. సోషల్ మీడియాలోనూ అందుకు సంబంధించిన పోస్టులు పెడుతుంటారు. అయితే కొందరు నటీనటులు మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఎంతలా అంటే తమ వ్యక్తిగత విషయాల్ని చాలా జాగ్రత్తగా ఉంచుతారు. అలాంటి వారిలో స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ ఒకరు. ప్రస్తుతం అతడు పెట్టిన ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇక విషయానికొస్తే.. షార్ట్ ఫిల్మ్ నటుడిగా కెరీర్ ప్రారంభించిన రాహుల్ రామకృష్ణ, ‘అర్జున్ రెడ్డి’ మూవీతో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ‘జాతిరత్నాలు’ లాంటి అద్భుతమైన చిత్రంలోనూ వన్ ఆఫ్ ది మెయిన్ లీడ్ గా చేశాడు. ఇక స్టార్ హీరోలందరితోనూ యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్న రాహుల్.. గతేడాది తన భార్యని పరిచయం చేశాడు. ఆమెకు లిప్ కిస్ ఇస్తున్న ఫొటోని పోస్ట్ చేశాడు. దీంతో చాలామంది ఒక్కసారిగా షాకయ్యారు. అప్పట్లో ఈ ఫొటో హాట్ టాపిక్ గా మారింది. పలువురు రాహుల్ ని సపోర్ట్ చేస్తే.. మరికొందరు మాత్రం ఎప్పటిలానే ట్రోల్ చేశారు. రాహుల్ మాత్రం వీటిని ఏం పట్టించుకోలేదు!
ఇక గతేడాది నవంబరులోనే తన భార్య ప్రెగ్నెన్సీతో ఉందని రాహుల్ రామకృష్ణ మరో ట్వీట్ చేశాడు. దీంతో ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది ఎవరికీ తెలియదు. లేదా రాహుల్ చెప్పాలనుకోలేదు. అందుకే ఆ విషయాన్ని దాచి, తన భార్య ప్రెగ్నెన్సీ ఉందని మాత్రమే చెప్పాడు. ఇప్పుడు తన భార్య, మగబిడ్డకు జన్మనిచ్చిందని ఫొటో షేర్ చేశాడు. ‘సంక్రాంతి రిలీజ్’ అని క్యూట్ గా క్యాప్షన్ కూడా పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో కాస్త వైరల్ గా మారింది. పలువురు నెటిజన్స్.. రాహుల్ రామకృష్ణకు విషెస్ చెబుతున్నారు.
Boy.
Sankranthi release. pic.twitter.com/SeU0Vo6BB1— Rahul Ramakrishna (@eyrahul) January 16, 2023