ఫిల్మ్ డెస్క్- కరోనా కేసులు అంతకంతకు పెరిగిపోతున్నాయి. సామాన్యుల నుంచి మొదలు ప్రముఖుల వరకు అంతా కోవిడ్ బారిన పడుతున్నారు. తాజాగా అందాల బుట్టబొమ్మ పూజా హెగ్డే కు కరోనా సోకింది. గత వారం ఈ విషయాన్ని పూజా హెగ్డే సోషల్ మీడియా ద్వార తెలిపింది. తనకు స్వల్పంగా కరోనా లక్షణాలు కనిపించాయని, టెస్ట్ చేయించుకుంటే కరోనా పాజిటివ్ అని తేలిందంటూ పూజా హెగ్డే చెప్పింది. తనను కలిసిన వారంతా కూడా పరీక్షలు చేయించుకోవాలని పూజా హెగ్డే కోరింది. కరోనా సోకిన వెంటనే క్వారంటైన్‌లోకి వెళ్లిపోయింది పూజా హెగ్డే. క్వారంటైన్ లో పూజా హెగ్డే బాగా ఎంజాయ్ చేస్తోందని తెలుస్తోంది.
కరోనా సమయంలో శ్వాసకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయని, వాటిని అధిగమించేందుకు యోగాసనాలు ఉపయోగపడతాయని పూజా హెగ్డే చెప్తోంది. అంతే కాదు పూజా హెగ్డే తాజాగా కొన్ని చిలిపి చేష్టలు చేసి ఎంటర్టైన్ చేసింది. క్వారంటైన్ లైఫ్ అంటూ చెబుతూ ఓ వీడియోను షేర్ చేశారు. కన్నుకొట్టేందుకు పూజా హెగ్డే తెగ ప్రయత్నించింది. కనుబొమ్మలు పైకి కిందకు చేస్తూ తన చేష్టలతో అందరినీ ఆకట్టుకుంది. అంతే కాకుండా క్వారంటైన్ లో పుస్తకాలు కూడా చదువుతున్నానని చెప్పింది పూజా. ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ ఆచార్య, రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్ సినిమాల్లో నటిస్తోంది. మరి కొన్న ప్రాజెక్టులు లైన్ లో ఉన్నాయని తెలుస్తోంది.