ఈ మధ్యకాలంలో యువతి యువకులు సినిమాల మోజులో పడి అందులో హీరోల మాదిరిగా నడుచుకునేందుకు తెగ ఆరాటపడుతున్నారు. రీల్ సీన్ లను రియల్ లైఫ్ లో ప్రయోగాలు చేస్తూ కొంతమంది యువత అదే ఫ్యాషన్ అంటూ కాలరెగరేస్తున్నారు. ఇక తాజాగా ఓ యువకుడు మాత్రం గీతాగోవిందం సినిమాలోని ముద్దు సీన్ ను ఇట్టే దించేశాడు. వినటానికి ఆశ్యర్యంగా ఉన్నా ఇది నిజం.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని ఓ యువకుడు కేఎస్ఆర్‌టీసీ కి చెందిన లగ్జరీ బస్సు బళ్లారి నుంచి బెంగుళూరు వెళ్తున్నాడు. ఇదే క్రమంలో అతని పక్క సీటులో ఓ అమ్మాయి కూర్చుంది. కొంత సేపటి నుంచి ఆ యువకుడు యువతి వంకే చూస్తున్నాడు. ఏదో చేయాలని అనుకుంటున్నా అతనికి ధైర్యం చాలక చేమటలు పట్టేస్తున్నాయి. ఇక ఎక్కేవాళ్లు ఎక్కుతున్నారు. దిగేవాళ్లు కూడా దిగుతున్నారు. మనోడు మాత్రం ఆ అమ్మాయిని చూస్తూ తెగ ఫీలైపోతున్నాడు.
ఇక అతను దిగాల్సిన స్టాప్ కూడా రానే వచ్చింది. డ్రైవర్ వెంటనే బస్సు ఆపాడు. ఇక ఆ యువకుడు దిగేందుకు రెడీ అయి పక్కన కూర్చున్న యువతిపై ముద్దుపెట్టి బస్సు దిగి పరుగులు పెట్టాడు. ఇక ఆ యువతి ఆగ్రహంతో స్థానిక పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముద్దు పెట్టి పారిపోయిన యువకుడి కోసం గాలిస్తున్నారు. ఇక రీల్ సీన్ ను రియల్ లైఫ్ లో ప్రయోగం చేసిన మనోడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.