వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. మనస్పూర్తిగా ప్రేమించుకున్నారు. జీవితాంతం కలిసి బతకాలని చాలా కలలు కన్నారు. నాకు నువ్వు, నీకు నేను.. అంటూ బాసలు చేసుకున్నారు. ఒకరికొకరు తోడుగా త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నారు. ఐతే విధి వారి జీవితాలతో వింత నాటకం ఆడింది. ప్రేమికుల్లోని ఒకరి అకాల మరణం మరొకరి జీవితాన్ని కూడా బలి తీసుకుంది. నువ్వు లేని ఈ లోకంలో నేను ఉండలేను.
ఇది చదవండి: కీచక ఉపాధ్యాయుడికి దేహశుద్ది చేసిన గ్రామస్థులు!
నీవులేని జీవిత శూన్యం, నీవెంటే నేను వస్తున్నా.. అంటూ ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయాని ప్రియుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర ఆవేధన నెలకొంది. ఈ విషాదకర ఘటన మంచిర్యాల జిల్లాలోని నెన్నెలలో జరిగింది. కుశ్నపల్లి గ్రామానికి చెందిన 18 ఏళ్ల జాడి రవి ఈనెల 2న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం చనిపోయాడు. వేమనపల్లి మండలం బుయ్యారం గ్రామానికి చెందిన దుర్గం సత్యశ్రీ , రవి సంవత్సర కాలంగా ప్రేమించుకున్నారు.
ఈ క్రమంలో సత్యశ్రీ అనారోగ్య కారణాలతో ఈనెల 2న మృతి చెందింది. దీంతో రవి మానసికంగా కృంగిపోయాడు. ప్రియురాలు సత్యశ్రీ లేని జీవితం వ్యర్థమని భావించి పురుగుల మందు తాగేశాడు. విషయం తెలుసుకున్న వెంటనే రవిని మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ అప్పటికే పరిస్థితి విషయమించడంతో, చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.