ఇటీవల కొన్ని రోజుల నుంచి తెలంగాణాలో వ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో పలు జిల్లాలో చెరువు, నదులు పొంగిపోర్లుతున్నాయి. అనేక చోట్ల పంటలు నీట మునిగాయి. రహదారులపై నీరు.. నదిలా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో బుధవారం మంచిర్యాల జిల్లా గట్టయ, నరసయ్య అనే ఇద్దరు రైతులు ఎడ్ల కోసం వెళ్లి సోమన పల్లి వద్ద గోదావరి వరద నీటిలో చిక్కుకున్నారు. వారిని గురువారం సహయ బృందం హెలి కాప్టర్ సాయంతో రక్షించింది. వివరాల్లోకి వెళ్తే..
మంచిర్యాల జిల్లాకు చెందిన గట్టయ్య, సారయ్య అనే ఇద్దరు రైతులు.. ఎడ్ల కోసం గోదావరి ఒడ్డున ఉన్న సోమనపల్లికి వెళ్లారు. అక్కడ ఒకసారికి వరద నీరు పెరిగింది. దీంతో చేసేది ఏమిలేక.. ఇద్దరు అక్కడే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కారు. వరద నీరు వాటర్ ట్యాంక్ పై అంచుల వరకు నీరు తాకుతూ ప్రవహించింది. దీంతో బుధవారం సాయంత్రం నుంచి గట్టయ్య, సారయ్యలు ఆ వరదనీటిలో చిక్కుకుని ఉన్నారు. సమాచారం అందుకున్న సహాయక బృందాలు.. అక్కడి చేరుకున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా ఆ ఇద్దరినీ సహాయక బృందం కాపాడింది.