ఉద్యోగం పురుష లక్షణం అంటారు. ఏదో ఒక పని చేసి నాలుగు డబ్బులు సంపాదిస్తేనే మగాడు మొనగాడు అవుతాడు. కానీ.., ఇప్పుడు కరోనా చాలా మందికి ఉపాధి లేకుండా చేసింది. లాక్ డౌన్ కారణంగా చాలా మందికి చేస్తున్న ఉద్యోగాలు పోయాయి. మరికొంత మందికి వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో.., ప్రస్తుత పరిస్థితిల్లో నిరుద్యోగుల సంఖ్య బాగా పెరిగిపోయింది. కానీ.., కాస్త మనసు పెట్టి ఆలోచిస్తే ఇదేం అంత పెద్ద కష్టం కాదు. ఎందుకంటే దేశంలో ఉద్యోగాలకి కొదవే లేదు. ముఖ్యంగా ఆన్లైన్ ని ప్లాట్ ఫామ్ గా చేసుకుని నడిచే కొన్ని సంస్థలు నిరుద్యోగులకు మంచి అవకాశాలను అందిస్తున్నాయి. ఇందులో భాగంగానే ప్రపంచంలోని అతిపెద్ద ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ లో భారీగా ఓపెనింగ్స్ రాబోతున్నాయట. వీటిలో ఫుల్ టైమ్, పార్ట్ టైమ్స్ జాబ్స్ కూడా ఉండటం విశేషం. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో డెలివరీ బాయ్స్ కోసం అమెజాన్ ఎదురుచూస్తోంది. డెలివరీ బాయ్ జాబ్ అని అంత తేలిగ్గా తీసి పారేయకండి. అమెజాన్ లో డెలివరీ బాయ్ గా నెలకి రూ.70వేల వరకు సంపాదించుకోవచ్చు. పైగా.., ఈరోజుల్లో అమెజాన్ సర్వీస్ లు లేని ఊరు లేదు. కాబట్టి.., మీ సొంత నగరంలోనే మీరు డెలివరీ బాయ్ గా ఉద్యోగం సంపాదించుకోవచ్చు. ఈ జాబ్ కి అప్లై చేయడానికి కూడా పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు డెలివరీ బాయ్ ఉద్యోగం కోసం నేరుగా అమెజాన్ సైట్ https://logistics.amazon.in/applynow లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది కాకుండా మీకు దగ్గరలో ఉన్న ఏదైనా అమెజాన్ బ్రాంచ్ ని సందర్శించి కూడా ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
నిజానికి డెలివరీ బాయ్ గా మీరు రోజంతా పని చేయనవసరం లేదు. ఆయా ప్రాంతాల్లో ఉండే ఆర్డర్స్ ని బట్టి ప్యాకేజీలు ఇస్తారు. ఎంత లేదన్నా రోజుకు 100 నుండి 150 ప్యాకేజీలను డెలివరీ చేస్తామని డెలివరీ బాయ్స్ చెబుతున్నారు. ఒక్కో డెలివరీకి 10 నుండి 20 రూపాయలు వరకు లభిస్తాయి. ఇక పని చేసే నగరాలని బట్టి అమెజాన్ సంస్థ డెలివరీ బాయ్స్ కి జీతాలను చెల్లిస్తుంది. ఈ లెక్కన నెలంతా పని చేసిన ఒక డెలివరీ బాయ్ కి తక్కువలో తక్కువ 60 నుండి 70 వేల వరకు సంపాదన ఉంటుంది. ఇక ఇది మాత్రమే కాకుండా.., పెద్ద ఉత్పత్తుల డెలివరీ కోసం కొన్ని షరతులపై కంపెనీ మీకు పెద్ద వాహనాలను కూడా అందిస్తుంది. ఇలాంటి డెలీవరీస్ సమయంలో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అయితే.., ఈ డెలివరీ బాయ్ జాబ్ కోవాలంటే కొన్ని అర్హతలు అవసరం. డెలివరీ బాయ్ కావడానికి మీకు కనీస విద్యార్హత ఉండాలి. అభ్యర్థి కనీసం 10th క్లాస్ పాస్ అయ్యిండాలి. డెలివరీ బాయ్ కి స్వంత బైక్ లేదా స్కూటర్ ఉండాలి. వాటి ఆర్సి, ఇన్సురెన్స్ చెల్లుబాటులో ఉండాలి. అలాగే, దరఖాస్తుదారునికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. ఇవన్నీ కనుక మీకు ఉండి.., జాబ్ కావాల్సిన పొజిషన్ లో మీరుంటే.. ఈ డెలివరీ బాయ్ జాబ్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. మరి.. ఈ జాబ్ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.