సాటి మనిషికి సాయం చేయడంలోనే నిజమైన దైవసేవ ఉందని పెద్దలు అంటుంటారు. అందుకే పూర్వకాలం ప్రతి ఒక్కరు తమ పాడి పంట నుంచి వచ్చే సంపదలో ఎంతో కొంత ఇతరలకు దానం చేసేవారు. పాలను సైతం పసిపిల్లలు ఉన్న వారి ఇంటికి వెళ్లి మరి ఉచితంగా పోస్తారు. అలా గ్రామం అంత ఒకతాటిపై ఉండి కలిసికట్టుగా జీవించే వారు. ఎవరికి ఎటువంటి ఆపద వచ్చిన ఊరు మొత్తం ఏకమవుతుంది. అయితే అది గత కాలం కానీ.. నేటికాలంలో కూడా అలాంటి ఊరు ఉంది.. అంటే మీరు నమ్మగలరా! అవునూ.. ఇప్పటీ ఆ గ్రామంలో ఎవరు పాలు అమ్మారు, అందరికి ఉచితంగా ఇస్తుంటారు. పొరపాటును పాలు అమ్మితే నేరంగా, పాపంగా భావిస్తారు. మరి.. ఆ ఊరు ఎక్కడో? ఈ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామం. చుట్టు పచ్చని పొలాలతో, పాడిపంటలతో కలకలలాడుతుంది ఆ గ్రామం. అక్కడ వందల సంఖ్యలో పశువులు ఉంటాయి. ప్రతి ఇంటిలో పదుల సంఖ్యలో పశువులు ఉంటాయి. మిగిలిన ప్రాంతాల్లో లాగా ఇక్కడ పాలను అమ్మరు. ఎవరికైన పాలు అవసరం అయితే ఉచితంగా పోస్తారు. అంతే కానీ పొరపాటున పాలు అమ్మరు. అలా పాలు అమ్మితే అరిష్టంగా భావిస్తారు ఆ గ్రామ ప్రజలు. అలా చేయడానికి ఓ బలమైన కారణం ఉందని గ్రామస్థులు తెలిపారు.17వ శతాబ్దానికి చెందిన గురువు బడే సాహేబ్.. గోవద చేయడం, వాటి నుంచి వచ్చే పాలను అమ్మడం చేయరాదని, అలా చేస్తే ఊరికే అరిష్టం జరుగుతుందని చెప్పినట్లు స్థానికులు తెలిపారు. ఇక అప్పటి నుంచి నేటీ వరకు ఆ ఊరిలో పాలను ఫ్రీగా ఇస్తారు. అన్ని కుల,మతాల వారు అన్నదమ్ముల కలసిమెలసి హాయిగా జీవినం సాగిస్తున్నారు. స్వార్థం నిండిపోయిన ఇలాంటి కాలంలో కూడా స్వచ్ఛమైన మనస్సు కలిగి ఉన్న గంజిహళ్లి గ్రామంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.