మన పిల్లలకు ఆస్తులు అంతస్తులు ఇవ్వాలని అనుకుంటాం. దానికి తగ్గట్లుగానే కష్టపడి సంపాదిస్తారు. కూడబెట్టి పిల్లలకు ఇస్తారు. కానీ కొందరు మాత్రం అలా ఆలోచించడం లేదు. సమాజం కోసం సేవ చేయాలనే సంపాదిస్తుంటారు. తాజాగా అలానే ఓ వ్యక్తి సమాజం మీద ప్రేమ.. పదిమందికి సాయం చేయాలనే ఆలోచన కలిగింది. మహిళల అభివృద్ధికి తోడ్పడాలనే ఆలోచనతో ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నాడు. తన సంపాదనలో కొంత సమాజసేవకు ఖర్చు చేస్తున్నాడు. ఎంతోమంది మహిళలకు ఉపాధి కల్పించాడు. ఎవరా వ్యక్తి? ఏం చేస్తున్నాడు?
కర్నూలు కు చెందిన షేక్ అబ్దుల్ బాషా. వృత్తిరీత్యా స్వర్ణకారుడు. బంగారం పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తను సంపాదిస్తున్న డబ్బులో కొంత భాగం సమాజ సేవ కోసం ఉపయోగిస్తున్నాడు. సొంత డబ్బులతో హెల్పింగ్ హ్యాండ్స్ మైనారిటీ వెల్ఫేర్ అండ్ డెవలప్ మెంట్ సొసైటీని స్థాపించాడు. ఈ కార్యక్రమాలకు తన సొంత డబ్బులను ఖర్చు పెడుతున్నాడు.ఇక్కడ కులం, మతం అనే తేడా లేకుండా ప్రతి పేదవారికి సాయం అందుతుంది. మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 360 మంది వరకు కుట్టు మిషన్‌లో శిక్షణ ఇప్పించారు అబ్దుల్ బాషా. శిక్షణ ఇప్పించడమే కాదు.. వాళ్లకు ఉద్యోగాలు కూడా ఇప్పిస్తున్నాడు.
సొంతంగా టైలర్ షాప్ పెట్టుకోవాలనుకునేవాళ్లకి కూడా సాయం చేస్తున్నాడు. మిషన్ నేర్చుకోవాల్సిన మహిళలను రెండు బ్యాచ్‌లుగా చేసి పొద్దున ఒక బ్యాచ్‌కి సాయంత్రం ఒక బ్యాచ్‌కి ఇస్తున్నామని చెప్తున్నారు అక్కడి ట్యూటర్స్. పక్కనవాళ్లకి రూపాయి పెట్టేందుకు ఎన్నో ఆలోచిస్తాం ఈ రోజుల్లో. అలాంటిది సమాజం మీద ప్రేమతో తన సంపాదనలో కొంత ఖర్చు చేస్తున్నాడు. ఎంతో మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నాడు.అబ్దుల్ చేస్తున్న ఈ కార్యక్రమాలు ఎంతో మంది స్ఫూర్తి దాయకం. అబ్దుల్ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చేయాలని కోరుకుందాం. మరి.. అబ్దుల్ బాషా చేస్తోన్న ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.