ఇప్పటివరకు భారతీయ అంతరిక్ష సంస్థ (ఇస్రో) నిర్వహించే రాకెట్ ప్రయోగాలను చూడాలంటే యాజమాన్యం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. దీని వలన సామాన్యులకు ఈ ప్రయోగ వీక్షణ లభించేది కాదు. కానీ ఇప్పుడు ఇస్రో యాజమాన్యం ఆ పరిస్థితికి స్వస్తి పలికింది. ప్రపంచంలో ఏ స్పేస్ సెంటర్‌లో లేని విధంగా సామాన్యుడు సైతం రాకెట్ ప్రయోగాన్ని ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించనుంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రకటన చేసింది.
అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా గగనతలంలోకి రాకెట్ల ద్వారా ఉపగ్రహాలను పంపిస్తారు శాస్త్రవేత్తలు. నిప్పులు చిమ్ముతూ ఆకాశంలోకి దూసుకెళ్తాయి రాకెట్లు. ఆ దృశ్యాలను ఎవరైనా టీవీలో చూడాల్సిందే. అయితే.. ఆ అద్భుతాన్ని ప్రత్యక్షంగా శాస్త్రవేత్తలతో కలిసి వీక్షించే అవకాశాన్ని కల్పిస్తోంది ఇస్రో. ఈ వారాంతంలో అనగా.. ఆగస్టు 7న ఉదయం 9.18 గంటలకు ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ1/ఈఓఎస్-02 మిషన్‌ను ప్రయోగించనుంది ఇస్రో. ఆ ప్రయోగాన్ని లాంచ్ వ్యూ గ్యాలరీ నుంచి ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
అలా నేరుగా చూడాలనుకునేవారు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కోసం ఈ https://lvg.shar.gov.in/VSCREGISTRATION/index.jsp లింక్ క్లిక్ చేయండి. ఈ మిషన్ ద్వారా ఈఓఎస్-02 , ఆజాదిసాట్ అనే రెండు శాటిలైట్లను మోసకెళ్లనుంది రాకెట్. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన ‘ఇస్రో’పై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The launch of the SSLV-D1/EOS-02 Mission is scheduled for Sunday, August 7, 2022, at 9:18 am (IST) from Satish Dhawan Space Centre (SDSC), Sriharikota. ISRO invites citizens to the Launch View Gallery at SDSC to witness the launch. Registration is open at https://t.co/J9jd8yDs4a pic.twitter.com/rq37VfSfXu
— ISRO (@isro) August 1, 2022
ఇదీ చదవండి: Bhuma Akhila Priya: భూమా ఇంట ఆస్తి వివాదాం.. అఖిలప్రియపై కోర్టుకెక్కిన తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి!
ఇదీ చదవండి: రంగంలోకి నేవీ అధికారులు.. సాయి ప్రియపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు!