మీరు నిరుద్యోగులా! అయితే ఈ సువర్ణావకాశాన్ని మిస్ చేసుకోండి. పదో తరగతి, డిప్లొమా వంటి చదువులతోనే ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ఉద్యోగం సాధించే అవకాశం మీ ముందుకొచ్చింది. ఆ వివరాలు..
నిరుద్యోగులకు ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) గుడ్ న్యూస్ చెప్పింది. ఇస్రో ఆధ్వర్యంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 94 ఖాళీలు భర్తీ చేయనున్నారు. ఇందులో టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, టెక్నీషియన్-బి, డ్రాఫ్ట్స్‌మ్యాన్ వంటి ఖాళీలు ఉన్నాయి. పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై వారు ఇందుకు అర్హులు. ఎలా దరఖాస్తు చేయాలి..? ఎంపిక విధానం..? జీతాలు ఎలా ఉంటాయి..? వంటి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మొత్తం ఖాళీలు: 94
విభాగాలు:
విద్యార్హతలు: పోస్టులను అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ/ ఎన్‌టీసీ/ ఎన్‌ఏసీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
వయోపరిమితి: 16-05-2023 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీతభత్యాలు: టెక్నికల్ అసిస్టెంట్/ సైంటిఫిక్ అసిస్టెంట్/ లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు; టెక్నీషియన్/ డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టులకు నెలకు రూ.21,700 నుంచి 69,100 వరకు వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు ఫీజు: పోస్టును అనుసరించి రూ.600, రూ.1000 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
దరఖాస్తులకు చివరి తేదీ: 16.05.2023.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్.