మేక మాంసం తిని ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. దీంతో పాటు ఆ కుటుంబానికి చెందిన 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అల్లూరు సీతారామరాజు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుసుకుంది. మేక మాంసం తిని ఓ 5 ఏళ్ల బాలిక ప్రాణాలు విడిచింది. అంతేకాకుండా ఆ బాలిక కుటుంబానికి చెందిన 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న ఆశా వర్కర్.. వెంటనే వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగిందంటే?
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం గన్నెల పరిధిలోని తడక. ఇదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఇటీవల చనిపోయిన మేక మాంసాన్ని వండుకుని తిన్నారు. అయితే తిన్ని కొద్దిసేపటికే ఆ కుటుంబలోని 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు.. ఆశా వర్కర్ కు సమాచారం అందించడంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే వారి కుటుంబంలోని ఓ 5 ఏళ్ల చిన్నారి అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. ఇక మిగతా కుటుంబ సభ్యులు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
ఈ ఘటనపై స్పందించిన అధికారులు అసలు ఆ బాలిక మరణానికి కారణం ఏంటి? అసలేం జరిగిందనే దానిపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై స్పందిచిన గ్రామస్తులు.. ఇటీవల ఆ కుటుంబ సభ్యులు అందరూ కలిసి చనిపోయిన మేక మాంసం తిన్నారని, దీని కారణంగానే వారు అస్వస్థతకు గురైనట్లు చెబుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. మేకం మాంసం తిని చనిపోయిన ఈ చిన్నారి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.