చిత్తూరు జిల్లా కుప్పంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ కార్యాలయంపై దాడి చేశారని కమిషనర్, కార్యాలయ సిబ్బందిని ఇబ్బంది పెట్టారని పోలీసులు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిలను పోలీసులు అరెస్టు చేశారు. అయితే సోమవారం రోజు జరిగిన దర్న కార్య క్రమంలో అమర్ నాథ్ రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగిన నిరసన ఘటనలో అమర్‌నాథ్ రెడ్డి, పులివర్తినానితో పాటు 19మందిపై పోలీసులు కేసునమోదు చేశారు. అయితే సోమవారం దర్న చేస్తే మంగళ వారం రాత్రి ఆరెస్టు చేయడం ఎంటి అని టీడీపీ కార్యకర్త లు ప్రశ్నిస్తున్నారు.
కుప్పంలో మున్సిపల్ ఎన్నికలలో విజయం సాధించడానికి వైఎస్ఆర్‌సీపీ ఆడుతున్న నాటకమని టీడీపీ కార్య కర్తలు ఆరోపిస్తున్నారు. అంతే కాదు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడంపై టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే.. కుప్పంలోని ఓ హోటల్ లో భోజనం చేస్తున్న పార్టీ నేతలను ఉన్నపళంగా అరెస్ట్ చేయడం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఫ్యాక్షన్ పోకడలకు ఇది అద్దం పడుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు. టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేసి కుప్పంలో ఎన్నికను ఏకపక్షం చేసుకోవాలన్నది జగన్ రెడ్డి ప్లాన్ అని చంద్రబాబు విమర్శించారు.
అమర్ నాథ్ రెడ్డి, పులివర్తి నాని అరెస్ట్ అప్రజాస్వామికం అని, అక్రమంగా అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండు చేశారు. ప్రజాసామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాల టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు.