మీడియా అంటే కేవలం బ్రేకింగ్ వార్తలకే మాత్రమే పరిమితం కాకుండా.. సామాన్యుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. ఈ అంశాన్ని బలంగా నమ్ముతున్న సుమన్ టీవీ ఓ వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టుంది. ప్రజాప్రతినిధులతో కలిసి వారి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను వారికి తెలియజేసి.. అక్కడే వాటిని పరిష్కరింపజేస్తోంది. దానిలో భాగంగా వైసీపీ అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌తో కలిసి.. ఆయన నియోజకవర్గంలో పర్యటించింది సుమన్ టీవీ బృందం. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అమర్నాథ్ మారు వేషంలో నియోజక వర్గంలో పర్యటించారు. పలు ప్రాంతాల్లో తిరుగుతూ.. ప్రభుత్వ విధానాల గురించి.. ప్రజల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత సంబంధిత అధికారులకు ఫోన్ చేసి.. ప్రజలు తెలిపిన సమస్యల గురించి ప్రస్తావించి.. వాటిని త్వరగా పరిష్కరించాలని సూచించారు.
ఇది కూడా చదవండి : అలా జరగకపోతే రాజకీయ సన్యాసం చేస్తా
ఈ క్రమంలో ఓ వీఆర్వో పని తీరు మీద అసంతృప్తి వ్యక్తం చేసిన అమర్నాథ్ .. 48 గంటల్లో అతడిని సస్సెండ్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఉగ్గినిపాలెం వీఆర్‌వో మీద ఓ రైతు ఫిర్యాదు చేశాడు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద ఉన్న భూమిని.. తమ పేరు మీద మార్చే అంశంలో వీర్వో ఇబ్బంది పెడుతున్నట్లు ఎమ్మెల్యేకి తెలిపాడు సదరు. రైతు. ఈ క్రమంలో అమర్నాథ్.. ఆర్డోవోకి కాల్ చేసి.. సదరు వీర్వో మీద 48 గంటల్లో చర్యలు తీసుకోవాలని సూచించారు. అమర్నాథ్ చర్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలపండి.
ఇది కూడా చదవండి : చెప్పులు కుట్టి, పాలిష్ చేసిన సీపీఐ నారాయణ!