ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విలయ తాండవం చేస్తోంది. ప్రపంచ దేశాలతో పాటు ఇండియాలో కూడా కరోనా అతివేగంగా వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకి కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుండటం జనాల్లో ఆందోళన కలిగిస్తుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జనాలకు నిద్రలేకుండా చేస్తుంది. తాజాగా మన దేశంలో 94 ఒమిక్రాన్ కేసులు నమోదయినట్లు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 1,525కి చేరుకుంది. ఇప్పటివరకు 560 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నట్లు సమాచారం. […]
దేశంలో రోజురోజుకి కరోనా మహమ్మారి కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నేపథ్యంలో 15-18 ఏళ్ల వయస్సు ఉన్నవారికి జనవరి 3 నుండి వాక్సినేషన్ ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. అదేవిధంగా హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వారియర్లతో పాటు 60 ఏళ్లు పైబడిన వారికి మూడో డోస్(బూస్టర్ డోస్) వేయాలని మూడో డోస్ టీకాపై సమావేశమైన నిపుణుల బృందం ఆదేశాలు జారీ […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్(RRR). జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీ ఎత్తున జరుపుతున్నారు మేకర్స్. అయితే.. ఓవైపు దేశంలో ఓమిక్రాన్ ఎఫెక్ట్ కూడా వణికిస్తుంది. మరోవైపు సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ లో మరో టెన్షన్ మొదలైంది. సౌత్ వైపు రాష్ట్రాలలో సినిమా థియేటర్లు ఓపెన్ ఉంటాయని అనుకున్నా.. ముఖ్యంగా RRR సినిమా హిందీ వెర్షన్ […]
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీగా జరుపుతున్నారు మేకర్స్. మరోవైపు స్పెషల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ కోసం సంక్రాంతికి విడుదల కావాల్సిన వేరే సినిమాలు కూడా విడుదలను వాయిదా వేసుకున్నాయి. మరి ఆర్ఆర్ఆర్ కి అన్నివిధాలా దారులు సుగమం […]
హైదరాబాద్- తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని.. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వేడుకలు, పండుగల వేళ ప్రజలు గుంపులుగా ఉండకుండా నివారించేందుకు ఆంక్షలు విధించాలని హైకోర్టు సూచించింది. ఈ అంశంపై రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది.
కోవిడ్ -19 కొత్త వేరియెంట్ ఓమిక్రాన్.. దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుందనే ఆందోళనలతో మలేషియా నూతన సంవత్సర వేడుకలు నిషేధించబడినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. ఇప్పటికే దేశంలో రెండో ఓమిక్రాన్ కేసు నమోదు కావడం.. అలాగే 18 ఓమిక్రాన్ అనుమానిత కేసులు నిర్ధారించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మలేషియా ఆరోగ్యశాఖ మంత్రి ఖైరీ జమాలుద్దీన్ విలేకరుల సమావేశంలో తెలిపారు. “రాబోవు 2022 నూతన సంవత్సర వేడుకలను అనుమతించడం జరగదు. అయితే.. న్యూ ఇయర్ లేదా […]
ఓమిక్రాన్ వేరియెంట్ భయం రోజురోజుకి టెక్ దిగ్గజ కంపెనీలలో పెరుగుతోంది. ఈ వేరియెంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతున్ననేపథ్యంలో ప్రభుత్వాలు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఉద్యోగుల భద్రతను దృష్టిలో పెట్టుకొని మరికొంత కాలం వర్క్‌ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగించాలని దిగ్గజ కంపెనీలు నిర్ణయించుకుంటున్నాయి. ఇదివరకే గూగుల్ ‘ఆఫీస్ రిటర్న్’ నిర్ణయాన్ని వాయిదా వేయగా.. ఇప్పుడు అదేబాటలో ఆపిల్ కూడా నిర్ణయం తీసుకుంది. ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఉద్యోగులు ఆఫీసులకు రావాలన్న నిర్ణయాన్ని వాయిదా […]
భాగ్యనగరంలో ఈ మధ్య ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న ‘సన్ డే-ఫన్ డే’, ‘ఏక్ శామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు నగర పురపాలక శాఖ ప్రకటించింది. ‘సన్ డే-ఫన్ డే’ అనేది ట్యాంక్ బండ్ పై నిర్వహిస్తుండగా.. ‘ఏక్ శామ్ చార్మినార్ కే నామ్’ కార్యక్రమం పాతబస్తీలోని చార్మినార్ వద్ద నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దేశాన్ని వణికిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై క్లారిటీ వచ్చేవరకు ఈ కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ […]
ప్రపంచాన్ని మొన్నటి వరకు కరోనా డెల్టా వేరియంట్ భయపెట్టింది. దీని ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టిందనుకునే లోపు ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ ముప్పుతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతుంది. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు కావడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్లను అధికారులు ట్రేస్ చేస్తున్నారు. టి నుండి విదేశాల నుంచి ముఖ్యంగా ఎట్ రిస్క్ దేశాల నుంచి వస్తున్న వారి పై […]