దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. మెగాపవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన ఈ సినిమా 2022 సంక్రాంతి కానుకగా జనవరి 7న రిలీజ్ కాబోతుంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ భారీగా జరుపుతున్నారు మేకర్స్. మరోవైపు స్పెషల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ కోసం సంక్రాంతికి విడుదల కావాల్సిన వేరే సినిమాలు కూడా విడుదలను వాయిదా వేసుకున్నాయి. మరి ఆర్ఆర్ఆర్ కి అన్నివిధాలా దారులు సుగమం అయ్యాయని అనుకుంటున్న తరుణంలో.. ఆర్ఆర్ఆర్ సినిమాకి విడుదల పరంగా వాయిదా టెన్షన్ పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే.. ఓమిక్రాన్ వేరియెంట్ వ్యాప్తి కారణంగా దేశంలోని పలు రాష్ట్రాలలో నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా రిలీజ్ డేట్ వరకు మరికొన్ని రాష్ట్రాలలో కూడా ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
మరి అదేగనక జరిగితే ఆర్ఆర్ఆర్ సినిమా వసూళ్లపై భారీ ప్రభావం పడుతుంది. ఈ లెక్కన ఆర్ఆర్ఆర్ మేకర్స్ విడుదల విషయమై ఆలోచనలో పడినట్లు ఇండస్ట్రీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. మరి ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో మేకర్స్ మరో ఆలోచన చేస్తారా.. లేక ఓమిక్రాన్ ప్రభావం ఉన్నప్పటికీ ధైర్యం చేస్తారా.. చూడాలి. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో ఇండియన్ స్టార్ యాక్టర్స్ అంతా నటించారు. మరి ఆర్ఆర్ఆర్ విడుదలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.