ఇంటర్ అయ్యిందా? మీకు టైపింగ్ మాస్టరా? ఐతే ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే. టైపింగ్ రాకపోయినా నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు ఈ జాబ్ వరిస్తుంది. మీ శ్రమకు అదృష్టం తోడైతే నెలకు 25 వేల నుంచి 81 వేలు జీతం సంపాదించుకోగలుగుతారు.
ఏ విద్యార్ధి అయినా కోరుకునేది ఏంటి.. చదువుతో పాటు ఆటలు, పాటలు, వినోదం. అయితే ప్రైవేటు రెసిడెన్షియల్ కళాశాలల్లో చదువు తప్ప వేరే యాక్టివిటీస్ ఉండవు. అడ్మిషన్ అప్పుడు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇస్తామని చెబుతారు గానీ అందులో నిజం ఉండదు. ఎంతసేపూ చదువు,చదువు అని విద్యార్థుల మీద ఒత్తిడి పెంచుతారు. ఆ ఒత్తిడి వల్ల నిద్ర సరిపోదు. దీని వల్ల జీవితం మీద విరక్తి పుడుతుంది. అందుకే కొందరు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది.
చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు రావడం.. జీతాలు పొందడం అన్నది కామన్. అదే చదువుతూనే ఆదాయం పొందొచ్చు అంటే ఎంత బాగుంటుందో కదా! ప్యాకెట్ మనీ కోసం ఇంట్లో వారిపై ఆధార పడక్కర్లేదు. పైగా సంపాదించే అలవాటు విద్యార్ధి దశ నుంచే మొదలవుతుంది. ఇప్పటివరకు ఇలాంటి అవకాశం డిగ్రీ, పీజీ వంటి పైచదువులు చదివిన వారికే ఉన్నా.. ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఆ అవకాశం కలగనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందుకోసం.. […]
ప్రస్తుతం బాగా డిమాండ్ ఉన్న జాబ్ ఏది అంటే టక్కున చెప్పే ఆన్సర్.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం. కళ్లు చెదిరే ప్యాకేజ్.. వీకెండ్స్, కంపెనీ పని మీద ఫారిన్‌కు వెళ్లే అవకాశం ఉండటంతో.. చాలా మంది యువత సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సంపాదించాలని కలలు కంటారు. అయితే సాఫ్ట్‌వేర్ కొలువు రావడం అంత సులభం ఏంకాదు. నాలుగేళ్ల పాటు ఇంజనీరింగ్ చదివిన తర్వాత కూడా.. ఏవో కోర్సులు నేర్చుకుని.. ఇంటర్నషిప్ వంటివి చేస్తే.. తప్ప కలల కొలువు సాధించడం సాధ్యం […]
అమరావతి- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక తేదీలను ప్రకటిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. విధ్యార్ధులకు సురక్షిత వాతావరణంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు. కరోనా కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారన్నారని అన్నారు. వారి ఆందోళనను పరిగణనలోకి తీసుకుని పరీక్షలను వాయిదా వేస్తున్నామని ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. […]