ఇంటర్ అయ్యిందా? మీకు టైపింగ్ మాస్టరా? ఐతే ఈ ప్రభుత్వ ఉద్యోగం మీ కోసమే. టైపింగ్ రాకపోయినా నేర్చుకోండి. ఖచ్చితంగా మీకు ఈ జాబ్ వరిస్తుంది. మీ శ్రమకు అదృష్టం తోడైతే నెలకు 25 వేల నుంచి 81 వేలు జీతం సంపాదించుకోగలుగుతారు.
ఇంటర్ పూర్తి చేశారా? ప్రభుత్వం ఉద్యోగం చేయాలని ఆశిస్తున్నారా? ఇంటర్ అర్హతతో ఈరోజుల్లో 25 వేల నుంచి 80 వేలకు పైగా జీతం ఎక్కడ వస్తుంది చెప్పండి? అది కూడా ప్రభుత్వ ఉద్యోగం. మీకు టైపింగ్ వస్తే చాలు ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందవచ్చు. ఒకవేళ టైపింగ్ రాకపోతే వెంటనే నేర్చుకోండి. ఇప్పుడు దరఖాస్తు చేసుకుని 10 రోజుల్లో టైపింగ్ నేర్చుకుంటే గనుక మీకు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ స్థాయిలో జీతం అందుతుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రూప్ సీ పోస్టుల భర్తీకై దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఖాళీలు 2674 ఉండగా.. స్టెనోగ్రాఫర్ ఖాళీలు 185 ఉన్నాయి. సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ జాబ్స్ కి సంబంధించిన సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. స్టెనోగ్రాఫర్ పోస్టుల వివరాలు మీ కోసం.